ఐదో దృశ్యం డన్స్నేన్ దుర్గంలో దుందుభి ధ్వనులతో, పతాకలతో మేక్బెత్, సైటన్, సైనికులు ప్రవేశిస్తారు. మేక్బెత్ : మన పతాకాలను బహిః ప్రాకారాలమీద ఎగురవేయండి. 'వారు వస్తున్నారు వారు వస్తున్నా రని ఎప్పుడూ ఒకటే కేకలు! రానీయండి! శత్రువుల" ముట్టడిని పరిహసించగల శక్తి మనదుర్గానికుంది. క్షామం, సంజ్వరం కబళించేటంతవరకూ వారిక్కడ పడి ఉండవలసిందే! మనపక్షంలో ఉండవలసినవాళ్ళు వచ్చి వారిలో చేరి బలాన్ని చేకూర్చినట్లయితే, మనం వాళ్ళను ధైర్యంతో ఎదుర్కొని ముఖాముఖిగా పోరాడి, తిరిగి ఇంటికి వెళ్ళేదాకా తరిమికొట్టవచ్చు. (లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖధ్వని వినిపిస్తుంది) ఆ ధ్వని ఎక్కడనుంచి? సైటన్ : అది స్త్రీ రోదనధ్వని మహారాజా! మేక్బెత్ : భయాలంటే నాకు రసన చచ్చిపోయింది. ఒకప్పుడు రాత్రివేళలో మూల్గు వినిపిస్తే నా సర్వేంద్రియాలూ చల్లబడిపోయేవి. ఒక విషాదగాథ విన్నపుడు నా కురులు నిక్కబొడుచుకొని నిల్చి చైతన్యవంతాలేమో అని అనిపించేవి. భీకరదృశ్యాలను కన్నులార ఆరగించాను. హత్యాసంబంధమైన భావాలతో నిండిన నా మనస్సుకు భీకరత్వం సుపరిచితమై పోయింది కనుక అది నన్ను కలత పెట్టలేదు. ఆ రోదనధ్వని ఎక్కడినుంచి? సైటన్ తిరిగి ప్రవేశిస్తాడు. సైటన్: మహారాజా! మహారాజ్ఞి మరణించింది. మేక్బెత్: నేడో రేపో ఆమె ఎప్పుడో ఒకప్పుడు మరణించవలసిందే. అట్టి మాట వినవలసిన కాలమంటూ ఒకటి ఉండనే ఉన్నది. జీవితగ్రంథం పరిసమాప్తి అయ్యేదాకా రేపు, రేపు - ఇలా ఒకరోజు తరువాత మరొకరోజు పరంపరగా సాగిపోవలసిందే. గడిచిపోయిన 'నిన్న'లన్నీ అదృష్టహీనులైన మర్త్యులను మృణ్మయమైన మృత్యుమార్గానికి దారి చూపించి పంపించాయి. ఆరిపో! ఓ క్షుద్రదీపమా! ఆరిపో! జీవితమంటే చరించే - 442 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/442
స్వరూపం