Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాలుగో దృశ్యం డన్స్నస్కు సమీపభూమి. దూరంగా అరణ్యం కనిపిస్తుంటుంది. దుందుభిధ్వనులతో, పతాకాలతో, మాల్కొం, వృద్ధ సివర్డు, యువ సివర్డు, మాక్డఫ్, మెంటియర్, కెయిథినెస్, అంగస్, లెన్నాక్స్, రాస్, సైనికులు సైనిక విన్యాసాలతో ప్రవేశిస్తారు. 78 మాల్కొం : సోదరులారా! భయరహితులమై శయ్యా గృహాలలో శాంతియుతంగా జీవించే దినాలు బాగా దగ్గరకు వచ్చాయనిపిస్తున్నవి. మెంటియథ్ ఈ విషయంలో మాకూ అనుమానమేమీ లేదు. సివర్డు : మన ముందున్న ఆ అరణ్యం పేరేమిటి? మెంటియథ్ : అది బిర్నాం మహారణ్యం. మాల్కొం: మన సైనికులలో ప్రతి ఒక్కరు తలా ఒక కొమ్మను విరిచి ముందు పెట్టుకొని నడవండి. అలా అయితే మన సంఖ్య ఎంతో శత్రువులకు తెలియదు. వారి చారులు తప్పుడు వార్తలతో తిరిగి వెళ్ళుతారు. సైనికుడు : తమ ఆజ్ఞలను అలాగే అనుసరిస్తాను. సివర్డు : ఆ క్రూరవిద్రోహి ఇంకా డన్స్నేన్ దుర్గంలోనే గాఢవిశ్వాసంతో ఉన్నాడనీ, మన ముట్టడికి కూడా సిద్ధపడి ఉన్నాడనీ మాత్రమే తెలుస్తున్నది. మాల్కొం : ఇక అదే అతని ప్రధానమైన ఆశ. అవకాశం చిక్కినప్పుడల్లా ఉత్తములు, క్షుద్రులు అన్న విభేదం లేకుండా అంతా అతన్ని విడిచిపెట్టేశారు. ఇప్పుడా తణ్ణి సేవిస్తున్న వారైనా బలవంతాన ఆ పని చేస్తున్నారేగాని హృదయమిచ్చి కాదు. మాక్డఫ్: మన ఊహలెంతవరకు సత్యాలో కార్యరంగంలో కలిగే ఫలితాలను నిర్ణయించనీయండి. అందాకా మనం అతిశ్రద్ధతోనే సైనికవ్యవహారాలను నడిపిద్దాము. సీవర్డు : 'ఇది మాకు లాభించింది. ఇది మేము నష్టపడ్డాము' అని చెప్పగలిగేటట్లు స్పష్టంగా తెలిసిపోయే సమయం ఆసన్నమైంది. కార్యాచరణకు పూర్వం చేసే ఊహలన్నీ మన అనిశ్చయాలైన ఆశలను మాత్రమే వెల్లడిస్తుంటాయి. కానీ సత్యమైన పరిణామాన్ని సమరతలంలో తగిలే దెబ్బలు తేల్చవలసిందే. ఆ యుద్ధంకోసం ఇక మన సైన్యాదులను తరలిద్దాం. (నిష్క్రమిస్తారు. సైనికవిన్యాసం) 441