Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/440

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రతివాడినీ పట్టి ఉరితీయించు. ఇక ఆలసించక నా కవచాన్ని తెచ్చిపెట్టు. వైద్యమహాశయా! మీ రోగి ఎలా ఉంది? వైద్యుడు : ఏవో మనోభావాలు వెంటవెంటనే వచ్చి ఆమెను బాధపెడుతున్నాయి. కాని మహారాజా! శారీరకంగా ఆమెకేమంత జబ్బు లేదు. మేక్బెత్ : అయితే మీరు ఆమెకు ఆ వ్యాధినే నయం చెయ్యండి! మీరు జబ్బుపడ్డ మనసులకు మందీయలేరా? గాఢంగా నాటుకొన్న దుఃఖాన్ని ఆమె జ్ఞాపకవీథి నుంచి విడబెరికి వెయ్యలేరా? గంభీరంగా నాటుకొన్న దుష్టబాధలను తుడిచివేయలేరా? భారవంతం చేస్తూ ప్రమాదకారియై ఆమె హృదయాన్ని అంటిపెట్టుకొన్న ఆ కశ్మలాన్నంతా అతిగాఢనిద్రను కల్పించే ఒక తీయనైన అరుతో కడిగివేయలేరా? వైద్యుడు : ఇది రోగి స్వయంగా చేసుకోవలసిన పని. మేక్బెత్ : అయితే, మీ వైద్యవిద్యనంతటినీ కుర్కురాలపాలేయండి. దానితో నాకేం పని లేదు. సైటన్! రా! శరీరానికి కవచాన్ని సంధించు. నా రాజదండాన్ని తెచ్చిపెట్టు. దేశంలోని మూలమూలలకు పరిశుద్ధి చేయటానికిగాను ఆశ్వికులను పంపించు. వైద్యమహాశయా! నా థేనులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. రావయ్యా! త్వరపడు! చేతనైతే ఓ వైద్యమహా శయా! నే పాలించే భూమికి పట్టిన వ్యాధి ఏమిటో కనిపెట్టు. తిరిగి దానికి పటిష్టమూ, స్వచ్ఛమూ అయిన ఆరోగ్యాన్ని చేకూర్చగలిగావో, దేశమంతటా మార్మోగేటట్లు ఎంతో ఘనంగా నిన్ను కీర్తిస్తాను. - ఈ కవచాన్ని విప్పివెయ్యి! రేవల చిన్ని, నేలతంగేడుల వంటి ఏ రేచనకారులైన ఓషధులతో ఈ ఆంగ్లేయులను కడిగివేయవచ్చునో చెప్పగలవా? వారిని గురించి విన్నావా? వైద్యుడు : మహాప్రభూ! తాము చేసిన ఘనసన్నాహాలు వారిని గురించి కొంతగా తెలుసుకొనేటట్లు చేశాయి. మేక్బెత్ : ఈ కవచాన్ని నా వెంట తీసుకో రా. బిర్నాం మహారణ్యం డన్స్నేన్ వరకు కదలివచ్చేదాకా నేను మృత్యువును గురించిగాని, వినాశాన్ని గురించి గాని భయపడను! (వైద్యుడు తప్ప అందరూ నిష్క్రమిస్తారు) వైద్యుడు : ఈ డన్స్నేన్ నుంచి ఒకమారు బయటికి వెళ్ళగలిగినా, కట్నమెంతిచ్చినా, అది మళ్ళీ ఇక్కడికి వచ్చే విషయంలో మమ్మల్ని లోభపెట్టలేదు. 440 (నిష్క్రమిస్తాడు) వావిలాల సోమయాజులు సాహిత్యం-3