Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేక్బెత్ : ఓరి తులువా! పదివేల బాతులున్నాయటరా! సేవకుడు : లేదు, మహారాజా, పదివేల సైనికులున్నారు. మేక్బెత్ : ఓరి పిరికిపందా! వెళ్ళి నీ ముఖాన్ని చీరుకొని నీ భయాన్ని మరింత ఎర్రవారజేసుకో. సైనికులెవరురా మూర్ఖుడా? ఆత్మ చచ్చిన అధమస్థుడా! తెల్లగా రవసెల్లా వంటి నీ చెక్కిళ్ళు చూసేవారికి భయాన్ని అంటిస్తున్నవిరా! ఓరి పాలిన మొఖం! వారు ఎవరి సైనికులురా? సేవకుడు : ఆంగ్లేయసైన్యం ప్రభూ! మేక్బెత్ : ఛీ! నీ ముఖం చూపించకు. వెళ్ళిపో. (సేవకుడు నిష్క్రమిస్తాడు) సైటన్! ఇలా పారిపోవటం చూస్తుంటే నా గుండె దిగజారిపోతున్నది. సైటన్! వినపడలేదా? ఈ ఎత్తిరావటం నాకు నిరంతరానందాన్నయినా కల్పిస్తుంది లేదా ఇప్పుడే పడద్రోయనైనా పడద్రోస్తుంది. బహుకాలం జీవించను, నా బ్రతుకు పండబారింది. ఆకులపాటుతో దానికి గ్రీష్మకాలం చేకూరింది. వృద్ధుడనైనప్పటికీ ముదిమివేళ మాంద్యాన్ని చేకూర్చే గౌరవం, ప్రేమ, భక్తసమూహం, మిత్రబృందం మొదలైనవాటిని వాంఛించే అవకాశం నాకు లేదు. వాటిస్థానంలో నాకు లభ్యమౌతున్నవి - గట్టిగా వినపడకపోయినా గాటమైన తిట్లు, పెదవులు దాటని భక్తి, బహిరంగంగా సాహసించలేకపోయినప్పటికీ హృదయాంతరాలలో మానివేయటమంటే మహానందాన్ని పొందే ఓటి పొగడ్తలు -సైటన్! సైటన్ : మహాప్రభూ! ఏమాజ్ఞ? సైటన్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : నా కోసం ఏమైనా క్రొత్తవార్త తెచ్చావా? సైటన్ : ఈ క్రొత్తవి పూర్వవార్తలను స్థిరపరుస్తున్నవి మాత్రమే. మేక్బెత్ : నా అస్థిమాంసాలను చిందరవందర చేసేదాకా పోరాడతాను. నా కవచాన్ని తెచ్చిపెట్టు. సైటన్ : మహారాజా! అటువంటి స్థితి ఇంకా రాలేదు. మేక్బెత్ : అయితే నేం. కవచధారణ చేస్తాను. అధికసంఖ్యలో అశ్వికులను పంపించాను. దేశమంతా తిరిగి పరిశుద్ధం చెయ్యమని వారితో చెప్పు. భయాన్ని గురించి మాటాడే 439