రాస్ : ఒక గంటకు ముందు జరిగింది ప్రాతబడటం వల్ల కథకుడి చేత 'హుస్' అనిపిస్తుంటే తుదిగా ఇది జరిగిందని చెప్పటం ఎంతో కష్టం. ప్రతిక్షణం క్రొత్తదంటూ ఏదో ఒకటి జరుగుతూనే వుంది. మాక్డఫ్ : నా భార్య ఎలా ఉంది? రాస్ : ఏం? క్షేమంగానే ఉన్నారు. మాక్డఫ్ నా బిడ్డలో? రాస్ : ఏం? వారు కూడా క్షేమంగానే ఉన్నారు. మాక్డఫ్ : మరి ఆ క్రూరనిరంకుశుడు వారి ప్రశాంతికి భంగం కలిగించలేదా? రాస్ : లేదు. నేను వారిని విడిచిపుచ్చి వచ్చినప్పుడు వారు ప్రశాంతంగానే ఉన్నారు. మాక్డఫ్ : లౌభ్యంతో నీ సంభాషణను కప్పిపుచ్చవద్దు. వారెలా ఉన్నారో చెప్పు. రాస్ : నా హృదయంలో మహాభారంగా భరించి తెచ్చిన వార్తను మీకు వినిపించటానికని బయలుదేరేటప్పుడు, ఆ క్రూరనిరంకుశుడి మీద కొందరు విప్లవం చేసి రణభూమిలో నిలిచినట్లు వదంతి చెలరేగింది. ఆ నిరంకుశుని సైన్యం యుద్ధభూమికి బయలుదేరటం స్వయంగా చూసివచ్చాను. గనుక అది సత్యమని స్థిరపడింది. ఇది మీరు మాకు సాయపడదగిన సమయం. మీరు స్కాట్లండులో ఉంటే చాలు. సైనికులను అదే సృష్టిస్తుంది. తీవ్రతరదుఃఖాలలో నుంచి బయటపడటానికి స్త్రీల చేత యుద్ధం చేయిస్తుంది. మాల్కొం : నేను అక్కడికి వస్తున్నాను కనుక ఈ వార్తతో వాళ్ళకు సంతోషం కలుగుగాక! మహోదారుడైన ఇంగ్లండు రాజు మాకు ఉత్తముడైన సీవర్డు ప్రభువును, పదివేల సైనికులను సాయమిచ్చాడు. ఆ సివర్డు ప్రభువుకంటే వృద్ధవీరుడు, ఉత్తమయోధుడు అయినవాణ్ణి సమస్త క్రైస్తవప్రపంచం మరొకణ్ణి ప్రసాదించలేదు. రాస్ : వినటంవల్ల మహానందాన్ని కల్పించిన ఈ వార్త వంటి వార్తను నేను వినిపించగలిగి వుంటే ఎంత బాగుంటేది! కానీ నేను ఎవ్వరి చెవులకు సోకరాక, మరుభూమిలో మాత్రమే ఆక్రోశించి వినిపించదగ్గ వార్త తెచ్చాను. మాక్డఫ్ ఆ దారుణదుఃఖవార్త దేనికి సంబంధించినది? ప్రజానీకానికంతటికీ సంబంధించిందేనా? లేక ఒక హృదయానికి మాత్రమే సంబంధించిందా? 431
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/431
స్వరూపం