ప్రదర్శింపనివాణ్ణి. ఎన్నడూ ఇతరులుంచిన విశ్వాసానికి విచ్ఛిత్తిని కల్పించనివాణ్ణి. దుష్టుడినైనా బయటపెట్టి వాడిని తోటిదుష్టుడికి ఒప్పచెప్పనివాడిని. స్వప్రాణవిషయంలో ఎంతటి ఆసక్తి వహిస్తానో, సత్యవిషయంలో కూడా అంతకు అణుమాత్రమైన తరుగని ఆస్థను వహించినవాణ్ణి. ఈ రీతి నాకు వ్యతిరేకంగా దోషారోపణం చేసుకోటమే తొలిసారిగా నేనాడిన అసత్యం. నా సత్యమైన ప్రకృతిని నేనిప్పుడు నీకు ఎరుకపరిచాను. నా సమస్తసేవలనూ నీకూ, నా అభాగ్యమాతృభూమికీ అర్పణ చేస్తున్నాను. నీవు ఇక్కడికి వచ్చిన కొద్దికాలానికి ముందే వృద్ధుడైన సివర్డు ఈ ప్రయోజనం కోసమే మార్చుకొన్న యోధాగ్రగణ్యులున్న పదివేలమంది సైన్యంతో స్కాట్లండుకు బయలుదేరటానికి సంసిద్ధుడైనాడు. ఇప్పుడు నీవు కూడా వచ్చావు కనుక మనమంతా కలిసి దండెత్తిపోదాము. ధర్మోపేతమైన కారణంలాగానే మనకు విజయావకాశం తథ్యమగుగాక! సరేనా? నీవు మూకత వహిస్తున్నావేమిటి? మాక్డఫ్ : ప్రియాలు, అప్రియాలు అయిన అంశాలు ఏకకాలంలో ఇలా వచ్చిపడ్డప్పుడు ఎలా సమన్వయించుకోవాలో నాకు తెలియటం లేదు. ఒక వైద్యుడు ప్రవేశిస్తాడు. మాల్కొం : సరే. ఈ విషయాలను గురించి తరువాత విపులంగా మాట్లాడుదాము. అయ్యా! రాజుగారు ఇప్పుడు బయటికి విచ్చేస్తున్నారేమో అడగవచ్చునా? వైద్యుడు : అవునయ్యా! వస్తారు. వారివల్ల వ్యాధినివారణ చేసుకోటంకోసం ఓ పెద్ద నిర్భాగ్యపుగుంపు వేచివుంది. ఈ జనాలవ్యాధి వైద్యవిద్యను తారుమారు చేస్తున్నది. అయితే పరమేశ్వరుడు ఆయన హస్తానికి అటువంటి పవిత్రతను ప్రసాదించాడు. ఆయన కరస్పర్శవల్ల ఆ వ్యాధి అమాంతంగా కట్టుబడిపోతున్నది. మాల్కొం : వైద్యమహాశయా! మీకు నమస్కారాలు! (వైద్యుడు నిష్క్రమిస్తాడు) మాక్డఫ్: ఇతడు చెప్పే వ్యాధేమిటి? 70 మాల్కొం : 'గండమాల'! ఈ దేశపురాజు విషయంలో ఇది ఒక అద్భుత చర్య. ఈ ఇంగ్లండులో ఉంటున్నప్పటినుంచీ ఈ వ్యాధిని ఆయన నివారించటం నేను చూస్తున్నాను. మరి ప్రార్థనలతో పరమేశ్వరుణ్ణి కదలించి ఎలా వశం చేసుకొంటాడో అది ఆయనకే తెలియాలి. శస్త్రవైద్యవిద్యకు నిరాశను కల్పిస్తూ, చూసేవారి హృదయాల్లో 429
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/429
స్వరూపం