లెన్నాక్స్ లేదు మహారాజా! మేక్బెత్ : వాళ్ళు వెళ్ళేటప్పుడు మీ ప్రక్కగా వెళ్ళలేదా? లెన్నాక్స్: లేదు మహారాజా! నిశ్చయంగా వెళ్ళలేదు. మేక్బెత్ : అయితే వారు పయనించే వాయువు విషపూరితమౌగాక! వారిని నమ్మినవారు వినాశమొందుదురుగాక!! ఎక్కడివో గుర్రపుడెక్కల చప్పుళ్ళు నాకు వినిపించాయి. ఎవరు వచ్చారు? లెన్నాక్స్: మహారాజా! మాక్డఫ్ ఇంగ్లండుకు పారిపోయాడన్న వార్తను నివేదించటానికి ఇద్దరో, ముగ్గురో వార్తాహరులు వచ్చారు. మేక్బెత్ : మాక్డఫ్ ఇంగ్లండుకు పారిపోయాడా? లెన్నాక్స్: అవును మహారాజా! మేక్బెత్ : నేను తలపెట్టిన భీకరకృత్యాలను అడ్డుకోటం కోసమో అన్నట్లు కాలమా! నీవు అతివేగంగా పరుగెత్తుతున్నావు. చేసిన వెంటనే కార్యరూపంతో పరిపూర్తిని కల్పింపకపోతే వట్టి తీర్మానాలు వ్యర్థాలు. 67 68 ఈ క్షణం నుంచీ నా హృదయంలో కలిగే ప్రతి ప్రథమోద్దేశం నా హస్తాలకు నిర్వర్తించిన ఆదిమ కర్తవ్యమౌగాక! ఇప్పుడు కూడా ఏ ఉద్దేశ కార్యరూపాల రెంటికీ సాహచర్యాన్ని కలిగిస్తాను. హఠాత్తుగా ఇప్పుడు మాక్డఫ్ దుర్గం మీద పడతాను. ఫైఫ్ ని అతని ఆస్తినంతటినీ స్వాధీనం చేసుకొంటాను. అతని భార్యను, బిడ్డలను, అతని వంశజులు కావటంవల్ల వారసులు కాదగిన అదృష్టహీనులనందరినీ నా ఖడ్గాంచలానికి బలి ఇస్తాను. బుద్ధిహీనుడు పలికే గర్వోక్తులు కావివి. నా ఉద్రేకం చల్లారకమునుపే ఈ పని చేసి తీరుతాను. ఇదివరకటిలాగా ఇక నాకు కేవల దృశ్యాలను చూడటంతో పనిలేదు. ఆ వార్తాహరులేరీ? పదండి. నన్ను వారి దగ్గరికి తీసుకుపోండి. (నిష్క్రమిస్తారు) రెండో దృశ్యం (ఫైఫ్, మాక్డఫ్ దుర్గంలోని సౌధం. మాక్డఫ్ ప్రభ్వి, ఆమె కుమారుడు, రాస్ ప్రవేశిస్తారు.) మాక్డఫ్ ప్రభ్వి : దేశంనుంచి పారిపోవలసినంతటి తప్పిదం వారేమి చేశారు? 420 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/420
స్వరూపం