Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/414

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చతుర్థాంకం ఒకటో దృశ్యం ఒక గుహ, మధ్యలో తెకతెక కాగుతున్న ఒక కొప్పెర. ఉరుములు. మాంత్రికురాండ్రు మువ్వురూ ప్రవేశిస్తారు. 61 ప్రథమ మాంత్రికురాలు : చారలపిల్లి ముమ్మూరు మ్యావ్ మ్యావన్నది. ద్వితీయ మాంత్రికురాలు : ముళ్ళపంది మూడున్నొక్కమారు 62 ముక్కుతో గుర్రు పెట్టింది. తృతీయ మాంత్రికురాలు : కొప్పెర చుట్టూ గుండ్రంగా తిరుగుదాం. విషమిచ్చి చంపిన జంతువుల ఆంత్రాదులను అందులో పడవేయండి. చర్మం మీదుగా విషాన్ని వెలిజిమ్ముతూ ముప్పది ఒక్క రాత్రింబవళ్ళ కాలం నిద్రించిన గోదురుకప్పను పట్టుకొన్నాం. దాన్ని ముందుగా ఆ మంత్రకటాహంలో ఉడకబెడదాం. రెక్కొని గొప్పగ రెండింతలుగా సంకటపడదాం, శ్రమచేద్దాం అగ్నీ, ఘనముగ వెలుగు! హండీ, మెండుగ ఉడుకు!! ద్వితీయ మాంత్రికురాలు : తేమనేలనుంచీ పట్టి తెచ్చిన పాము ముక్కలను కొప్పెరలో ఉడకపెట్టి మరిగిద్దాం. నీరుడం కంటిని, కప్ప బొటనవ్రేలిని, గబ్బిలం వెంట్రుకలను, కుక్కనాలను, కట్లపాము రెండు పాయలనాలుకను, మొండికట్టె తోకను, బల్లికాలును, గుడ్లగూబ లెక్కను - వీటన్నింటినీ కలిపి ఉడికించి వేయిద్దాం. అందరు : రెక్కొని గొప్పగ రెండింతలుగా సంకటపడదాం, శ్రమ చేద్దాం. అగ్నీ, ఘనముగ వెలుగు! హండీ, మెండుగ ఉడుకు!! తృతీయ మాంత్రికురాలు : ఘటసర్పపు పొలుసు చర్మాన్ని, తోడేలు పన్నును, మమ్మీ పొట్టను, ఉప్పునీటి సముద్రంలో ఆకలితో అలమటించే షార్కుచేప గొంతుకను, రాత్రివేళ 414 వావిలాల సోమయాజులు సాహిత్యం-3