నా భయం అతితీవ్రంగా ఉంది. అతని ప్రకృతిలోని రాజసం అతడంటే నేనెప్పుడూ భయపడేటట్లు చేస్తూనే ఉంది. అతడు అసామాన్యమైన సాహసం కలవాడు. మనోధైర్యానికి తోడుగా సర్వవ్యవహారాలను భద్రతతో నడిపించగల వివేకం కూడా అతనికుంది. ఒకరి ఉనికిని చూచి నేను భయపడతగ్గ వాడంటూ ఒకడుంటే ఆతడు తప్ప మరెవ్వరూ లేరు. సీజర్ ఎదుట మార్క్ ఆంటోనీ సంరక్షకశక్తి నిస్తేజమయ్యేదని చెప్పుకొంటున్నట్లుగా, అతడి ఎదుట నా సంరక్షకశక్తి భయకంపితమౌతున్నది. 48 'నీవు రాజువౌతా' వని మంత్రగత్తెలు నాతో చెపుతున్నపుడు అతడు వారిని మందలించాడు. తనతో ప్రసంగించవలసిందని శాసించాడు. అపుడు వారు 'నీవొక రాజపరంపరకు మూలపురుషుడవౌతా' వని జోస్యం చెప్పి అతడికి జయనెట్టారు. వారు నిరర్థకమైన కిరీటాన్ని నా శిరసుమీద నిలిపారు. నా వంశంతో ఎట్టి సంబంధమూ లేని మరొకని హస్తం బలవంతంగా లాగుకొనేటందుకు రాజదండాన్ని నా హస్తాని కందించారు. నాకు పిమ్మట నన్ననుసరించి నా పుత్రుల్లో ఎవరూ రాజ్యపాలన చెయ్యరట! అది అలాగే జరిగేటట్లయితే బాంకో సంతతికోసం నేను నా మనస్సును మలినం చేసుకొన్నానన్నమాట! మహోదారుడైన డంకన్ ను వారికోసం మహాఘోరమైన హత్య చేశానన్నమాట!! వారికోసం మధురమైన నా శాంతి చషకంలో కటుకాలైన ఓషధులను కలుపుకొన్నాన్నమాట!! బాంకో వంశజులను రాజులను చెయ్యటం కోసం మానవజాతికి సామాన్యశత్రువైన సైతానుకు అనర్హమణియైన నా ఆత్మను అమ్ముకొన్నానన్నమాట!! అలా జరగనీయను. అంతకంటే రానీ. విధి వ్యతిరేకపక్షంలో చేరిపోరాడనీ, మరణపర్యంతం ఎదుర్కొంటాను - ఎవరక్కడ? ఇరువురు హంతకులతో ఒక సేవకుడు ప్రవేశిస్తాడు. ద్వారం దగ్గరికి వెళ్ళి మేము తిరిగి పిలిచేదాకా అక్కడనే ఉండు. (సేవకుడు నిష్క్రమిస్తాడు) మనమిరువురం కలిసి మాటాడింది నిన్ననే కదా! మొదటి హంతకుడు : అవును మహారాజా! నిన్ననే. మేక్బెత్ : మంచిది. మేము మాటాడినదాన్ని గురించి బాగా ఆలోచించావా? మీ అదృష్టాన్ని పూర్వం అరికట్టింది అతడే. ఏమీ ఎరగని మేము ఆ పని చేశామని మీరనుకున్నారు. లేనిపోని ఆశలు కల్పించి మిమ్మల్ని ఎలా వంచించిందీ, ఎలా మీకు అడ్డంకిగా నిలిచిందీ, ఎటువంటి సాధనాలను అతడు ఉపయోగించిందీ, వాటితో 397
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/397
స్వరూపం