Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మేక్బెత్ : అయ్యో! లోపం జరిగింది! మీకు తెలియకుండానే మీకు లోపం జరిగింది. జీవితమనే చెలమకు మూలమైన నీటిబుగ్గను నిలిపివేశారు. మీ జీవితాన్ని ఆపివేశారు. మాక్డఫ్ : మీ తండ్రిని, మహారాజును, హత్య చేశారు? మాల్కొం : అయ్యో! ఆ పని చేసిందెవరు? లెన్నాక్స్ : మా బుద్ధికి తోచినంతలో ఆయన శయ్యాగృహరక్షకులు, వారి హస్తాలు, ముఖాలు రక్తపంకిలాలై ఉన్నాయి. ఇంకా వాటిని తుడవనైనా లేదు. అవి మాకు వారి తలగడలమీద కన్పించాయి. ఒక్కమారు వారు గ్రుడ్లు విప్పి మమ్మల్ని చూచారు. మేము భయభ్రాంతులమైనాము. ఎంతటివారైనా ప్రాణాపాయం లేదని నమ్మి వారి ప్రాంతానికి వెళ్ళటం క్షేమం కాదు. మేక్బెత్ : ఆ సేవకులే స్పష్టంగా దోషులని ప్రత్యక్షంగా తెలిసిపోయినప్పటికీ, కోపతన్మయత్వంలో వారిని హతమార్చినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. మాక్డఫ్: మీరెందుకలా చేయవలసి వచ్చింది? మేక్బెత్ : అట్టిస్థితిలో మనస్సంక్షోభాన్ని పొందుతూ వివేకంతోను, కోపోద్రేకాన్ని వహించి సమచిత్తంతోను, రాజభక్తిని భరిస్తూ ఉపేక్షాభావంతోను ఎవరుండగలరు? మానవుడెవడూ ఉండలేడు! మహారాజునెడ నాకు గల ప్రేమతీవ్రత, నిలుకడను కల్పించే నా వివేచనశక్తిని త్రోసిరాజన్నది. రక్తపుచారికలతో ఒక వంక బంగారు తీగలను కూర్చి అల్లిన రజతవస్త్రంలాగాను, వినాశశక్తి బలవంతంగా ప్రవేశించి తన దుష్కృత్యాన్ని నిర్వర్తించటానికని ప్రకృతి శరీరంలో పడ్డ గండ్లలా తోచే సందులువడ్డ గాయాలతోను ఒక వంక మహారాజు శరీరమూ, మరొకవంక హంతకులు వారి వృత్తికి చిహ్నమైన రక్తవర్ణంతోను ఘోరంగా పేరుకొన్న నెత్తుటిజాళ్ళతోను కనిపిస్తుంటే, ప్రేమించనేర్చినదీ, ఆ ప్రేమను ప్రదర్శించటానికి యోగ్యమైన సాహసం కలదీ అయిన హృదయం కలవాడెవడు నావలె వ్యవహరించకుండా ఊరుకొంటాడు? మేక్బెత్ ప్రభ్వి : అయ్యో! సాయపడండి! మాక్డఫ్ : ఆమె విషయంలో అతిశ్రద్ధ తీసుకోండి! 390 వావిలాల సోమయాజులు సాహిత్యం-3