(మళ్ళీ ధ్వని వినిపిస్తుంది) వస్తున్నాను! త్వరపడకండి. ఈ ద్వారపాలకుణ్ణి" మరిచిపోకండి!! (ద్వారాన్ని తెరుస్తాడు) మాక్డఫ్, లెన్నాక్స్ ప్రవేశిస్తారు. మాక్డఫ్ : ఏమోయ్ మిత్రుడా! తలుపు తీయడానికి ఇంత ఆలస్యమైందేం? రాత్రి నిద్రపోయేటప్పటికి ఆలస్యమైందా ఏమిటి? ద్వారపాలకుడు : ఆర్యా! మేము రెండో మారు కోడి కూసేదాకా త్రాగుతూనే ఉన్నాము. మాక్డఫ్ : మీ యజమాని మేల్కొనివున్నారేమో నీకు తెలుసా? అదుగో, ఆయన ఇక్కడికే వస్తున్నారు. బహుశః మేము చేసిన ధ్వనులు ఆయనను మేల్కొల్పి ఉంటాయి. మేక్బెత్ తిరిగి ప్రవేశిస్తాడు. లెన్నాక్స్ : మహోదయా, సుప్రభాతం! మేక్బెత్ : మీ ఇరువురికీ సుప్రభాతం!! మాక్డఫ్ : థేన్ మహాశయా! మహారాజులు నిద్ర మేల్కొన్నారా? మేక్బెత్ : ఇంకా లేదు. మాక్డర్ : ఉదయమే పెందలకడ మేల్కోవలసిందని నన్నాఙ్ఞాపించారు. ఇప్పటికే ఆలస్యమైనదనుకొంటుంటారు. మేక్బెత్ : అయితే నేను మిమ్మల్ని వారి దగ్గరకు తీసుకుపోతాను. మాక్డఫ్ : ఇటువంటి శ్రమ తీసుకోవటం మీకు సంతోషప్రదమైన కృత్యమని నాకు తెలుసు. నేనే ఒంటరిగా వెళ్ళి వారి దర్శనం చేసివస్తాను. మేక్బెత్ : ఏ శ్రమంటే మనకు సంతోషదాయకమో దానివల్ల కలిగే శారీరకబాధకు తగ్గ బహూకృతి దానిలోనే ఉంటుంది. మాక్డఫ్ : ఆ కర్తవ్యాన్ని మహారాజులు నాకు నిర్దేశించారు. కనుక వెళ్ళి మేల్కొల్పటానికి నేనే ధైర్యం చేస్తాను. (నిష్క్రమిస్తాడు) 387
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/387
స్వరూపం