వారికిచ్చిన పానీయాలలో నేను కొన్ని ఓషధులను కలపటం వల్ల వారిలో జీవమరణాలమధ్య సంకులసమరం సాగుతున్నది. తత్ఫలితంగా వారు జీవించనూ వచ్చు లేదా మరణించనూవచ్చు. మేక్బెత్ : (లోపల) ఎవరక్కడ? అయ్యో! ఏమిటది?
మేక్బెత్ ప్రభ్వి : అయ్యో! పరిచారకులు మేల్కొనివుంటారా? ఆ పని జరిగివుండదు. కార్యరూపాన్ని ధరించని యత్నం నన్ను కలవరపెడుతున్నది. ఏమాధ్వని? వారికోసం నేను ఛురికను సిద్దపరిచేవచ్చాను. కృత్యనిర్వహణంలో నా భర్త విఫలుడు కాకూడదే! నిద్రిస్తూన్న మహారాజు నా తండ్రిని పోలి నాకు కన్పించి ఉండకపోయినట్లయితే నేనే ఈ కృత్యాన్ని నిర్వర్తించి వుండేదాన్ని. ప్రియసతీ! మేక్బెత్ ప్రవేశిస్తాడు. మేక్బెత్ : నేనాకృత్యాన్ని పరిపూర్తిని కల్పించాను. నీకు శబ్దమేమీ వినిపించలేదూ? మేక్బెత్ ప్రభ్వి : ఒక గ్రుడ్లగూబ కేక, కీచురాళ్ళ ఏడ్పు వినిపించింది. మీరేమీ మాట్లాడుకోలేదా? మేక్బెత్ : ఎప్పుడు? మేక్బెత్ ప్రభ్వి : ఇప్పుడే. మేక్బెత్ : నేను పైనుంచి దిగివస్తున్నప్పుడా? మేక్బెత్ ప్రభ్వి : అవును. మేక్బెత్ : విను. ఆ ధ్వనేమిటో? డంకన్ కక్ష్యకు ప్రక్కగదిలో నిద్రించే దెవరు? మేక్బెత్ ప్రభ్వి : డోనాల్బెయిన్. మేక్బెత్ : (తన హస్తాలను చూస్తుంటాడు) మేక్బెత్ ప్రభ్వి : దీన్ని దీనదృశ్యం అని అనటం కేవలం అజ్ఞానవిలసితమైన అభిప్రాయం. మేక్బెత్ : ఒకడు నిద్రలో నవ్వుతున్నాడు. రెండోవాడు 'హత్య!' అని కేకపెట్టాడు. ఒకరినొకరు మేల్కొల్పుకొన్నారు. వారు మాట్లాడుకొంటుంటే నేను నిలిచి విన్నాను. వాళ్ళు ప్రార్థనలు చెప్పుకొని తిరిగి నిద్రకు సంసిద్ధులైనారు. 383