Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముందుగా వార్తనందించటంకోసం ఊపిరి సలుపుకోలేక మరణించేటంతటి వేగంతో, మరణిస్తే వార్త అందదేమోనన్న భయంతో వచ్చాడు. మేక్బెత్ ప్రభ్వి : వాడికి క్రమమైన పరిచర్య చేయించండి. అతడు తెచ్చిన వార్త ఎంతో ఘనమైంది. (వార్తాహరి నిష్క్రమిస్తాడు) ఇలాంటి అరిష్టసూచకమైన వార్త చెప్పేటప్పుడు బొంత కాకి గొంతుక కూడా వెలుగురాయటం సహజం. అట్టి స్థితిలో డంకన్ మా సౌధంలో ప్రవేశిస్తున్నాడన్న వార్త తెచ్చిన వార్తాహరికి నోటమాట పెగిలిరాకపోవటంలో వింతేముంది? మానవుల మనోభావాలను వెన్నంటి వుండే ఓ అదృష్టశక్తుల్లారా! రండి!! నాలోని స్త్రీత్వాన్ని తొలగించండి. నఖశిఖపర్యంతం నన్ను నిర్భరక్రౌర్యంతో నింపి వేయండి. నా శరీరంలోని రక్తాన్ని కరడుగట్టించండి. కరుణకెట్టి ప్రవేశాన్నీ కల్పించకండి. దారులనన్నింటినీ మూసివేయండి. లేకపోతే ప్రయోజనాన్ని సాధించనీయకుండా ప్రకృతిసహజాలైన అనుమానాలు నన్ను క్రుంగదీయవచ్చు లేదా నా ఉద్దేశానికీ, తదాచరణకూ మధ్య ఆటంకాలుగా అవి నిలిచిపోవచ్చు. ఓ హత్యాసచివులారా! మానవులు క్రూరకృత్యాలను ఆచరించే వేళల్లో అదృశ్యరూపులై వెంట ఉండి సాయపడే మీరు, నా స్తనద్వయం మీదికి విచ్చేసి అందలి క్షీరరసాన్నంతటినీ విషంగా మార్చేసి, నన్ను పరమక్రౌర్యమూర్తినిగా రూపొందించండి. నా నిశితకరవాలం కల్పించే గాయం దానికంటికి కనుపించకుండా ఉండేటందుకు, ఆ వినీలకంబళంలో నుంచి తొంగిచూచి వియత్తు 'ఆప' మని కేకపెట్టకుండా ఉండేటందుకు, ఓ కరాళకాళరాత్రీ! నారకధూమాన్ని కప్పుకొని నా కోసం రా! 26 మేక్బెత్ ప్రవేశిస్తాడు ఘనుడా గ్లామిస్!2 యోగ్యుడా కౌడర్!! అనతికాలంలో మీకబ్బనున్న మహనీయ బిరుదంతో మిమ్మల్ని ఆహ్వానించటానికి అంగీకరించండి. మీ లేఖలు ముందేమి జరుగునున్నదో ఎరుకపడని వర్తమానకాలపు టెల్లల కెంతో అవలకు నన్ను నడిపించుకోపోయినవి. ఇప్పటికీ నేను ఆ భవిష్యత్తులోనే ఇంకా జీవిస్తున్నట్లు అనుభూతిని పొందుతున్నాను. మేక్బెత్ : పరమప్రియా! ఈ రాత్రికి డంకన్ ఇక్కడికి వస్తున్నాడు. 373