Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముందుగావెళ్ళి నా భార్యకీ వార్త చెప్పి, ఆమెను సంతోషభరితాంతఃకరణను చేస్తాను. సెలవు దయచేయించండి. డంకన్ : కౌడర్ మహాశయా! అలాగే. నీవు వెళ్ళవచ్చు. మేక్బెత్ : (స్వగతం) 'కంబర్లాండు యువరాజు! నా మార్గమధ్యాన ఒక మెట్టు ఏర్పడింది. నేను దీన్ని తట్టుకొని పడవచ్చు లేదా దుమికి బయటపడవచ్చు. ఓ తారకల్లారా! మీ మీ తేజాలను తిరోహితాలు చెయ్యండి! కలుషాలైన నా రహస్యాకాంక్షలను బయటపెట్టకండి!! నా హస్తం ఏమి చేస్తుందో దాన్ని నా నేత్రం చూడకుండా చేయండి. నిర్వర్తితమైన తరువాత ఆ కార్యాన్ని చూసి అది భయాన్ని పొందుగాక! (నిష్క్రమిస్తాడు) డంకన్ : యోగ్యుడా, బాంకో! నీవన్నది సత్యం. నీవు వర్ణించినట్లు ఇతడు వీరగుణపరిపూర్ణుడే. ఇతణ్ణి గురించిన నీ వర్ణనలు నాకు విందులా విశేషతృప్తిని కల్గించాయి. స్వాగతం చెప్పే విషయంలో సర్వసౌఖ్యాలను చేకూరుద్దామన్న శ్రద్ధతో ఇతడు ముందుగా వెళ్ళాడు. ఇతడు సత్యంగా సాటిలేని బంధువు. (తుత్తారధ్వని. నిష్క్రమిస్తారు) ఐదో దృశ్యం ఇన్వర్నిస్లో మేక్బెత్ సౌధం. లేఖ చదువుతూ మేక్బెత్ ప్రభ్వి ప్రవేశిస్తుంది. మేక్బెత్ ప్రభ్వి : “నేను విజయం చేకొన్ననాడు వారు నన్ను కలుసుకొన్నారు. లోపరహితమైన వారి కథనాన్ని బట్టి, వారికి మానవాతీతమైన విజ్ఞానం ఉన్నదని నేను గ్రహించాను. ఉత్సాహోద్రిక్తతతో మరికొన్ని ప్రశ్నలడగాలన్న కోర్కె నాకు కలగంగానే గాలిలో లీనమై అలా చిత్రంగా వారు అదృశ్యమైపోయినప్పుడు, నేనద్భుతావిష్ణుడనై చేష్టలు దక్కి నిలుచున్నాను. ఇంతలో మహారాజు దగ్గిరనుంచి వార్తావహులు వచ్చి పూర్వం విధిసోదరీమణులు జయవెట్టినట్లుగానే "కౌడర్ థేన్! జయ" మని నాకు జయపెట్టారు. పూర్వ మా సోదరీమణులు "భవిషన్మహారాజా! జయ!" మని పల్కి ముందు నేను మహారాజును అయ్యే కాలం వస్తున్నదని సూచించారు కూడాను. నా ఘనతలో భాగస్వామినివైన నీకు భవిష్యత్తులో ఎట్టి ఆధిక్యం అబ్బనున్నదో తెలియకపోవటం వల్ల, నాతో తుల్యమైన ఆనందాన్ని పొందే అవకాశం పోగొట్టకుండా 371