Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/370

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చెప్పుకొని అనుగుణంగా బహూకరింపగలిగే శక్తి నాకు దక్కేటట్లుగా నీ యోగ్యతలు కొంత తక్కువ అయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను చెప్పగలిగింది ఒక్కటే. నా సర్వాధికారంలో ఉన్న సమస్తం కంటేను, అంతకంటే అధికంగాను నేను నీకు ఋణపడ్డాను. మేక్బెత్ : స్వామిభక్తి సేవలనే ఋణాలను చెల్లించవలసిన బాధ్యత నాకుంది. ఏ కృత్యం వల్లనైనా అట్టిసేవ చేయటమంటే నే పడ్డ ఋణాన్ని చెల్లించటమే ఔతుంది. సేవకధర్మాలైన అట్టి కర్తవ్యాలను స్వీకరించటం మీ వంతు. మా కర్తవ్యాలు తమకూ, తమ రాజ్యానికీ తల్లిదండ్రులకు పిల్లలెలాంటివారో అలాటివి. యజమానులకు సేవకులవంటివి. నిర్వర్తించవలసిన కర్తవ్యాలను మేము సక్రమంగా నిర్వర్తిస్తే తమమీది ప్రేమ గౌరవాలవల్ల నిర్వర్తించవలసినవాటిని నిర్వర్తించటమే ఔతుంది. డంకన్ : నీవనే లతను నేనిప్పుడే నాటాను. అది పరిపూర్ణరూపంలో వృద్ది పొందటానికి అవసరమైన సమస్తకృషిని చేస్తాను. బాంకో మహాశయా! నీవూ మేక్బెత్తో తుల్యమైన యోగ్యతను సంపాదించుకొన్నావు. అంతటి యోగ్యత నీకుందని ఎరుకపడటానికిగా దానిని ఉచితరీతిని ప్రకటించుకోవచ్చు. ఏదీ నిన్నొక మారు కౌగిలించుకొని నా హృదయానికి హత్తుకోనీ. బాంకో : నేను వృద్ధిపొందితే కలిగే ఫలసాయమంతా తమదే. డంకన్ : ఆపుకోలేని నా ఆనందం అశ్రుజలంతో పరిపూర్తిని పొందదలచింది. పుత్రులారా! సోదరులారా!! నా సింహాసనానికి సన్నిహితులైన ఇతర వ్యక్తులారా!! గ్రహించండి. ఇప్పుడే రాజ్య వారసత్వాన్ని నా జ్యేష్ఠపుత్రుడైన మాల్కొంకు దత్తత చేస్తున్నాను. ఇకనుంచి 'కంబర్ లాండు యువరాజు' అని అతనికి నామకరణం చేస్తున్నాను. ఇట్టి గౌరవాన్ని అతడొక్కడే కాక మరికొందరు కూడా పొందవలసివుంది. ఈ ఉత్తమలాంఛనాలు నక్షత్రాల్లా యోగ్యత కలవాళ్ళను మరింత తేజోవంతులనుగా భాసింపజేస్తాయి. ఇక్కడ నుంచి మనం ఇన్వర్నెన్కు వెళ్ళవలసి వుంది. అక్కడ నీవు మాకు గేస్తువై వర్తించి, ఇంతకంటే ఎంతో అధికంగా మమ్మల్ని ఋణగ్రస్తులను చేసుకోవచ్చు. మేక్బెత్ : తమ సేవకు వినియోగించకుండా పొందే విశ్రాంతి కాలాన్ని తీవ్రమైన శ్రమకంటే మాకు భరించటం ఎంతో కష్టం. నేనే తమ రాకను గురించిన హెగ్గడికాడనై 370 వావిలాల సోమయాజులు సాహిత్యం-3