Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయ మాంత్రికురాలు : సోదరీ, నీవెక్కడికి వెళ్ళావు? ,18 ప్రథమ మాంత్రికురాలు : ఒక నావికుడి పెళ్ళాన్ని కలుసుకొన్నాను. ఆమె ఒళ్ళో అడవి బాదాములు కుప్పబోసుకున్నది. పళ్ళు లేకపోవటం వల్ల ఆమె వాటిని చివుళ్ళతో నములుతున్నది. 'కొన్ని నాకివ్వ'మని అడిగాను. కశ్మలం తినే ఆ గజ్జిముండ 'పో, పోవే మంత్రగత్తే!' అని నన్ను తిట్టి కసిరింది. దాని మొగుడు 'టైగ’" రనే నౌకకు అధిపతిగా ఎలెప్పోకు వెళ్ళాడు. ఇక్కడినుంచే బయలుదేరి నేను సముద్రంమీద ఒక చేటలో ప్రయాణం చేసి తోకలేని ఎలుకలా ఆ నౌకలో ప్రవేశిస్తాను. తప్పక వెళ్ళి తీరుతాను. నా పగ తీర్చుకొంటాను. ద్వితీయ మాంత్రికురాలు : అందుకు నీకు అనుకూలమైన ఒక గాలిని నేనిస్తాను. ప్రథమ మాంత్రికురాలు : సోదరీ! నీవెంతటి దయగలదానివి! తృతీయ మాంత్రికురాలు : నేను నీకు మరొక గాలినిస్తాను. 19 ప్రథమ మాంత్రికురాలు : ఇక మిగిలిన గాలులన్నీ నా అధీనంలోనే ఉన్నాయి. గాలులమీద నాకిటువంటి అధికారం కలిగింది గనుకే వారు చేరే రేవు పట్టణాలన్నిటి మీదా, నావికుని దిక్సూచిఫలకం చూపించే అన్ని దిక్కులమీదా, నాకు అధికారం ఉన్నట్లే. రక్తాన్నంతటినీ ఓడ్చేసి వాణ్ణి ఎండుగడ్డిలా వాడ్చి వేస్తాను. వాడికి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చేస్తాను. వాలిపోయే రెప్పలిక వాడి కళ్ళమీద మూతలు పడవు. వాడు బహిష్కృతుడిలా బ్రతకవలసిందే. క్రమంగా వాడు ఎనభై ఒక్కవారాలు కృశించి వాడి వత్తయిపోవలసిందే. వాడి నౌకను సర్వనాశనం చేయటానికి అవకాశం లేదు. అయినా దాన్ని పెనుతుపానుల్లో ఉర్రూతలూగిస్తాను. ఇదిగో, నా దగ్గిర ఉన్నదేమిటో చూడండి! ద్వితీయ మాంత్రికురాలు : ఏదీ, నన్ను చూడనీ. నన్ను చూడనీ! ప్రథమ మాంత్రికురాలు: ఇది ప్రవాసంనుంచి ఇంటికి తిరిగివస్తుండగా పడవ మునిగిపోయిన ఒక కర్ణధారి బొటన వ్రేలు. (లోపలినుంచి దుందుభిధ్వని వినిపిస్తుంది) తృతీయ మాంత్రికురాలు : దుందుభి! దుందుభి!! - అంటే మేక్బెత్ వచ్చేశాడన్నమాట! మాంత్రికురాండ్రు మువ్వురు : విధికి మనం కూతుళ్ళం! 20 వేరు లేని మువ్వురం! 363