Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిరాకరించనట్లుగా భర్తకు తెలియజేస్తుంది. మేక్బెత్ తన భవిష్యత్తును గురించి మాంత్రికురాండ్రతో మళ్ళా ఒకమారు మాటాడి, వారి సలహాను పొంది రావటానికి నిశ్చయిస్తాడు. (దృశ్యం 4). ఒక క్షేత్రసీమలో తనకు తెలియజేయకుండానే మేక్బెత్తో స్వతంత్రంగా వ్యవహరించారని మంత్రగత్తెలను కోపించి, వారి విద్యాధిదేవత అయిన హెకేట్, తాను మేక్బెత్ను వినాశనం చెయ్యటానికి నిశ్చయించినట్లుగా తెలియజేసి, తన పథకాన్ని వారికి వివరిస్తుంది (దృశ్యం 5). ఫోర్రెస్ సౌధంలో మేక్బెత్ ప్రవర్తన కొందరు ప్రభువులకు అనుమానాన్ని కల్పించింది. డంకను, బాంకోను మేక్బెత్తే హత్య చేశాడని ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నట్లు, లెన్నాక్స్ మరొక ప్రభువుతో చేసిన సంభాషణ వల్ల తెలుస్తుంది. క్రూరవిద్రోహియైన మేక్బెత్ పాలననుంచి దేశాన్ని ఉద్దరించటానికి, ఆంగ్లప్రభువు సహాయాన్ని అర్థించటంకోసం మాక్డఫ్ ఇంగ్లండు వెళ్ళినట్లు ఆ ప్రభువు లెన్నాక్స్కు తెలియజేస్తాడు. (విందు దృశ్యం 6). చతుర్థాంకం - ప్రతిచర్య ఒక చీకటి గుహలో మాంత్రికురాండ్రు శక్తిమంతమైన ఒక 'కవచాన్ని' తయారుచేస్తుంటారు. వారివల్ల తన భవిష్యత్తును తెలుసుకోదలచిన మేక్బెత్ ప్రవేశించి, నాకు ముందేమి జరుగనున్నదో తెలుపవలసిందని ఆజ్ఞాపిస్తాడు. మంత్రగత్తెలు అతనికి మూడు ఛాయారూపాలను చూపించి తుదకు ధైర్యం చెప్పటం జరుగుతుంది. కనిపించిన మొదటి పిశాచరూపం 'మాక్డఫ్ను గురించి జాగ్రత్త' అనీ, రెండో పిశాచరూపం 'స్త్రీకి జన్మించినవాడికి నీవు భయపడ పనిలేదనీ, మూడో పిశాచరూపం 'బిర్నాం మహారణ్యం డన్స్నేన్ వరకూ కదలి వచ్చేదాకా నీవు విప్లవానికిగాని, యుద్ధానికిగాని భయపడవ'ద్దని మేక్బెతు తెలియజేస్తాయి. తరువాత అతడు బాంకో సంతానం ఎప్పటికైనా స్కాట్లండుకు రాజులౌతారేమో తెలియజేయవలసిందని శాసిస్తాడు. అప్పుడు మంత్రగత్తెలు అతనికి బాంకో వంశపరంపరలోని ఎనిమిదిమంది రాజుల ఛాయారూపాలను చూపించి, అదృశ్యమైపోతారు. ఆ దృశ్యాన్ని చూచిన తరువాత మేక్బెత్ క్రోధోన్మత్తుడై మంత్రగత్తెలను తిట్టిపోస్తాడు. ఇంతలో లెన్నాక్స్ వచ్చి, మాక్డఫ్ ఇంగ్లండుకు పారిపోయినట్లు మేక్బెత్కు నివేదిస్తాడు. మేక్బెత్ పట్టజాలని కసితో మాక్డఫ్ ప్రభ్విని, ఆమె సంతానాన్ని చంపివేయటానికి 343