Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తృతీయాంకం - ద్వితీయవిద్రోహం ఫోర్రెస్ సౌధంలో మేక్బెత్కు అతిథిగా ఉన్న బాంకో మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని గురించి ఏవేవో ఊహలు చేస్తుండగా, మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి వచ్చి అతణ్ణి రాజసౌధంలో ఆ నాటి రాత్రి జరుగుతున్న విందుకు ఆహ్వానిస్తారు. రాజపదవి అబ్బిన మేక్బెత్, బాంకో సంతానపరంపర రాజ్యపాలన చేస్తుందని మంత్రగత్తెలు చెప్పిన జోస్యాన్ని మరచిపోలేదు. అందుకని అతడు బాంకోను, అతని కుమారుడైన ఫ్లియాన్సును హత్య చేయటానికి నిశ్చయిస్తాడు. ఈ కృత్యాన్ని నిర్వహించటానికని మేక్బెత్ ఇరువురు హంతకులను నియమిస్తే, వారు తగిన పథకం వేస్తారు (దృశ్యం 1). బాంకో హత్యనుగూర్చిన పథకాన్ని ఎరుగని మేక్బెత్ ప్రభ్వి ఆ విషయాన్ని తెలుసుకొంటుంది. గడచిపోయిన విషయాలను గురించి పదేపదిగా ఆలోచనా నిమగ్నుడౌతూ, ఉన్మత్తుడిలా ప్రవర్తిస్తున్న మేక్బెత్ చర్యను ఆమె నిందిస్తుంది. అప్పుడు అతడు తాను బాంకో, ఫ్లియాన్సు తనను సింహాసనం నుంచి దింపివేస్తారేమోనని భయపడుతున్న విషయం ఆమెకు తెలియజేస్తాడు. (దృశ్యం 2). మేక్బెత్ సౌధానికి సన్నిహితంగా ఉన్న ఒక ఉద్యానవనంలో హంతకులు బాంకోను హత్య చేస్తారు. ఫ్లియాన్సు తప్పించుకొని పారిపోతాడు. (దృశ్యం 3). రాజసౌధంలో విందుకు ఏర్పాట్లు జరుగుతాయి. రాజు, రాజ్ఞి - మేక్బెత్, మేక్బెత్ ప్రభ్వి - అతిథులను, ప్రియవాక్యాలతో ఆహ్వానిస్తారు. బాంకోను హతమార్చిన హంతకులలో ఒకడు ద్వారప్రదేశానికి వచ్చి కనిపిస్తే, మేక్బెత్ అక్కడికి వెళ్ళి అతడితో స్వల్పంగా సంభాషించి వస్తాడు. ఫ్లియాన్సు తప్పించుకొని పారిపోవటం మేక్బెత్ను విశేషంగా కలతపెట్టటం ప్రారంభించింది. అతిథుల సంగతిని పట్టించుకోకుండా ఆలోచనావీథిలో పడిపోయిన మేక్బెత్న, అతనిస్థానం దగ్గిరకు పిలుచుకొనివచ్చి ఉత్సాహాన్ని కల్పించటానికి మేక్బెత్, ప్రభ్వి యత్నిస్తుంది. తన స్థానందగ్గరికి వచ్చిన మేక్బెత్ బాంకో ప్రేతరూపం తన ఆసనాన్ని ఆక్రమించుకొన్నట్లుగా విభ్రాంతిని పొందుతాడు. అప్పుడతడు ప్రదర్శించిన భయావేశం అతిథులనందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. మేక్బెత్ ప్రభ్వి తన భర్తను అటువంటి భావావేశాలను పొందటం యౌవనకాలం నుంచీ అలవాటని నచ్చజెప్పి, అతిథులను వెళ్ళిపోకుండా కూర్చోపెడుతుంది. మేక్బెత్ మనస్సును చిక్కబట్టుకొని ఒక ద్రాక్షాసవాన్ని అందరికీ ఇప్పిస్తున్న సమయంలో, బాంకో ప్రేతరూపం మళ్ళా అతనికి కన్పించి ఉద్విగ్నుణ్ణి చేస్తుంది. విందు యత్నమంతా భగ్నమౌతుంది. తరువాత మేక్బెత్ ప్రభ్వి మాక్డవ్ వారివిందుకు రావటానికి 342 వావిలాల సోమయాజులు సాహిత్యం-3