లేకుండా అతడు కాపలావాళ్ళదగ్గర విడిచిరావలసిన ఛురికలను వెంట తెస్తాడు. మేక్బెత్ ప్రభ్వి అతణ్ణి తిరిగి వాటిని లోపలికి తీసుకోపోయి కాపలావాళ్ళదగ్గరి పెట్టి, అనుమానం వాళ్ళమీద పడేటందుకుగాను వారి ఒడళ్ళనిండా రక్తాన్ని పులిమి రమ్మని చెపుతుంది. అతిభీతివల్ల మేక్బెత్ ఆ పని చెయ్యటానికి నిరాకరించినప్పుడు, మేక్బెత్ ప్రభ్వి భర్త హస్తాలలో నుంచి ఛురికలను లాగుకొనివెళ్ళి, తానే ఆ పని చేసివస్తుంది. డంకన్ కక్ష్యనుంచి ఆమె తిరిగివచ్చిన వెంటనే ద్వారం దగ్గిర గట్టిగా తట్టిన చప్పుళ్ళు వినిపిస్తాయి. మేక్బెత్ ప్రభ్వి చేతులు కడుగుకొని నిద్రను నటించటం తమ కర్తవ్యమని త్వరపెట్టి భర్తను వెంట తీసుకోపోతుంది (దృశ్యం2). డంకన్ కక్ష్యకు ప్రక్కన ఉన్న కక్ష్యలో విడిది చేసిన మాక్డఫ్, లెన్నాక్స్ పెద్దగా చప్పుడు చేసి నిద్రిస్తున్న ద్వారపాలకుణ్ణి మేల్కొల్పుతారు. అతడు అర్థరహితమైన ప్రలాపం చేసి తలుపు తీస్తాడు. ఇంతలో మేక్బెత్ వచ్చి వారిని కలుసుకొంటాడు. మాక్డఫ్ డంకన్ కక్ష్యలోకి వెళ్ళి, నిహతుడైన డంకనన్ను చూసి వచ్చి, ఆ హత్యావిషయాన్ని మేక్బెత్కు ఎరుకపరిచి కేకలు పెట్టి సౌధంలో వాళ్ళనందరినీ మేల్కొల్పుతాడు. ఇంతలో మేక్బెత్ ప్రభ్వి, బాంకో కూడా అక్కడికి వస్తారు. మేక్బెత్, లెన్నాక్స్ ఇరువురూ డంకన్ కక్ష్యకు వెళ్ళినప్పుడు మేక్బెత్ తీవ్రకోపాన్ని నటించి అక్కడి కాపలావారిని చంపివేస్తాడు. వారు తిరిగి వచ్చేటప్పటికి మాల్కొం డొనాల్బెయిన్ కూడా అక్కడికి చేరుతారు. వారికి మేక్బెత్ కోపతీవ్రతలో తాను రాజును హత్యచేసిన కాపలావారిని చంపివేశానని చెపుతాడు. ఈ వార్త విన్నవెంటనే మేక్బెత్ ప్రభ్వి మూర్ఛపొందుతుంది. ఆమెను తీసుకోవెళ్ళినతరువాత కొలది కాలానికి, దుష్టబుద్ధి ఐన మేక్బెత్ విద్రోహాన్ని గ్రహించి డంకన్ రాజుపుత్రులైన మాల్కొం, డొనాల్బెయిన్ ఇంకా అక్కడ ఉంటే తమ ప్రాణాలకు కూడా ప్రమాదం సంభవిస్తుందని భావించి, స్కాట్లండునుంచి పారిపోవటానికి నిశ్చయించుకుంటారు. (దృశ్యం 3) మేక్బెత్ సౌధానికి బయట డంకన్ రాజు హత్య జరిగిన నాటి రాత్రి కనుపట్టిన శకునాలను, అశుభసూచనల గురించి రాస్ మరొక వృద్ధుడితో చర్చిస్తుంటాడు. ఇంతలో మాక్డఫ్ అక్కడికి వచ్చి పారిపోవటంవల్ల రాజును కుమారులే హత్యచేశారని ప్రజలు అనుమానిస్తున్నట్లు తెలియజేస్తాడు. రాస్ అతనితో ప్రజలు మేక్బెత్ను ప్రభువుగా ఎన్నుకొన్నారని, త్వరలోనే అతనికి కిరీట ప్రదానోత్సవం స్కోన్లో జరుగనున్నదనీ తెలియజేస్తాడు (దృశ్యం 4) 341
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/341
స్వరూపం