అన్వేషించాడు. డంకనన్ను హత్య చేయటానికి వెళ్ళబోయేముందు మేక్సెత్కు కవితాత్మను ప్రసాదించి పంపించాడు. మాక్డఫ్ కుటుంబాన్ని హత్య చేయించే సందర్భంలో, ఆ కాలంలో పక్వమైన బాలుని తొక్కు పలుకుల మూలంగా అక్కడి భయానకతకు కొంత ఉపశమనాన్ని కల్పించాడు. కథాంతవేళలో మేక్బెత్ 'వైద్యుణ్ణి నే పాలించే భూమికి పటిష్టమూ, స్వచ్ఛమూ అయిన ఆరోగ్యాన్ని చేకూర్చగలవా?' అని ప్రశ్నించి కవితాత్మతో వ్యవహరించటం వల్ల, అతని తుదివేదనావస్థను కొంతగా కప్పిపుచ్చాడు. మహాకవి షేక్స్పియర్ కొంత అనుదాత్తస్థాయితో కల్పించిన దృశ్యాల మూలంగా కూడా ఈ ఉపశమనాన్ని సంతరిస్తుంటాడు. డంకన్ హత్యకు సిద్ధపడుతున్న మేక్బెత్ మనోవేదనను దర్శించి శ్రమగొన్న ప్రేక్షకుల బుద్దికి, ద్వారపాలకుని దృశ్యం మూలంగా నాటకకర్త కొంత విశ్రాంతిని చేకూర్చాడు. లేకపోతే హత్య ఎరుకపడిన తరువాత వచ్చే భయానక సన్నివేశాలను వారు భరించటం కష్టమౌతుంది. అంకం II దృశ్యం 4 మూలంగా ప్రేక్షకులను మేక్బెత్ దుర్గం నుంచి దూరంగా తీసుకుపోయి, వారి బుద్ధిని తాత్కాలికంగా హత్యావ్యవసాయానికి దూరం చేయటం కూడా ఈ ఉపశమనసంతరింపు కోసమే. బాంకో హత్య తరువాత మంత్రగత్తెలకు 'హెకేటుకు జరిగిన సంభాషణకు, ఆ హత్యావ్యవసాయం చేత అనిబద్ధభీతిని పొందిన మేక్బెత్ను దర్శించినపుడు కలిగే శ్రమనుంచి ప్రేక్షకులకు కొంత విశ్రాంతి కల్పించటమే ప్రయోజనం' అంకం III దృశ్యం 4లో కూడా ఇట్టి ప్రయోజనమే ఉద్దేశితమైంది. షేక్స్పియర్ మహాకవి చతుర్థాంకంలోని తృతీయదృశ్యాన్ని మాక్డఫ్ సత్యసంధతను మాల్కొం పరీక్షించటం, మాక్డఫ్ తన భార్యాపుత్రుల వధను గురించి వినడం అన్న రెండు భాగాలుగా విభజించి వస్తుగమన వైపరీత్యంతో ప్రేక్షకబుద్ధికి ఒక విచిత్రోపశమనాన్ని కల్పించటం ప్రశంసాయోగ్యమైన నాటకీయశిల్ప కౌశలవిశేషం. కథాపరిచ్ఛేదం ప్రథమాంకం - ప్రలోభం ఒక మరుభూమిలో మువ్వురు మాంత్రికురాండ్రు సమావేశమై, విప్లవాన్ని అణచి విజయాన్ని చేకొని యుద్ధభూమినుంచి డంకన్ రాజును హత్య చేయాలన్న నిశ్చితపథకంతో వస్తున్న మేక్బెత న్ను, 'ఒక క్షేత్రసీమ'లో కలుసుకోటానికి నిశ్చయిస్తారు. ఇతరుల మనస్సులో ప్రవేశించి సర్వాన్నీ గ్రహింపగల శక్తి ఉన్న దుష్టమాంత్రికురాండ్రు 338 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/338
స్వరూపం