మేక్బెత్ - మాంత్రికురాండ్రు “మేక్బెట్లోని మంత్రగత్తెలు విచిత్రసృష్టి. వీరు సామాన్యంగా జనవిశ్వాసంలో కన్పించే మాంత్రికురాండ్రవంటివారు కారు. ఇంతకంటే ఎంతో శక్తిమంతలు. విధి దేవతలవంటివారు. మానవజాతి కతీతమైన భవిష్యద్విజ్ఞానం వీరికున్నట్లు విస్పష్టంగా గోచరిస్తుంది. మాంత్రికురాండ్రను గురించి తన కాలంలో ఉన్న అభిప్రాయాలను గ్రహించి, షేక్స్పియర్ ఈ మాంత్రికురాండ్రను భావించి వారికి ఎన్నో అతీతశక్తులను ప్రసాదించాడు. సామాన్య జనశ్రుతిలో చీపురుకట్టలతో కన్పించే మంత్రగత్తెలు కారు. వీరు విరూపలైనా ఉదాత్తత లోపింపనివారు. వీరు మహాశిల్పి మైకలాంజెలో చిత్రించిన మానవ జీవితతంతువుల ననుయించే వృద్ధవనితలతో తుల్యమైన స్థానాన్ని ఆక్రమింపదగ్గవారు” అన్న డౌడన్ మహాశయుని అభిప్రాయం గమనింపదగినది. మేకెత్లోని మంత్రగత్తెలలో రెండు తెగలవారున్నారనీ, అందులో మొదట కన్పించినవారు (అం దృ1) స్కాండినేవియా దేశంలోని భూతభవిష్యద్వర్తమానాలకు అధిదేవతలైన నోర్సన్లనీ, రెండవమారు కన్పించినవారు (అం IV దృ 1 ) సామాన్య జనశ్రుతిలోని మాంత్రికురాండ్రవంటి వారనీ ఒక అభిప్రాయముంది. ఈ అభిప్రాయాన్ని ఖండించి త్రోసిపుచ్చి, షేక్స్పియర్ సృష్టించిన మంత్రగత్తెలు సామాన్య జనశ్రుతిలోని మాంత్రికురాండ్రేగాని, దేవతలైన నోరన్లు కారని విమర్శకులు నిరూపించారు. మేక్బెత్ : నాటకీయ ఏకత ఎంత రమణీయమైలైనప్పటికినీ, కొన్ని కథాసన్నివేశాలనుగాని, లేదా కొన్ని కథాభాగాలను గాని ఒకచోట చేర్చినంతమాత్రాన నాటకం కాజాలదు. అందువల్లనే గ్రీకు నాటకతత్త్వవేత్త అరిస్టాటిల్ నాటకంలో ఆదిమధ్యాంతాలందు ఒక కార్యపరిణామాన్ని మాత్రమే ప్రదర్శించవలెనని నిర్ణయించాడు. ఇట్లే స్థలైక్యం, కాలైక్యంగూడా ప్రాచీన లాక్షణికు లేర్పరచినప్పటికీ, అనుసరించి వాటికి విశేషప్రాముఖ్యాన్నివ్వటం తరువాతి నాటకకర్తలు మానివేశారు. మేక్బెత్ నాటకంలో సమస్తమూ మేక్బెత్ ఉదయాస్తమయాల మీద కేంద్రీకృతమైంది. ఇందులో ప్రాసంగికకథ అంటూ ఏమీ లేదు. నాటకీయోపశమనానికో లేక తులనాత్మక రసభావ ప్రదర్శనలలో ప్రవేశపెట్టిన ఇతరసన్నివేశాలు కూడా అల్పసంఖ్యాకాలు. మంత్రగత్తెలు మేక్బెత్ను జోస్యంతో మోసగించటం ప్రథమాంకంలోనే ప్రారంభమౌతుంది. తృతీయాంకంలోని తృతీయ దృశ్యంలో ఫ్లియాన్సును కూడా హత్య 336 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/336
స్వరూపం