Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నార్వే ప్రభువైన స్వైనో దండయాత్రోదంతాలు లేనే లేవు. బాంకో, ఫ్లియాన్సు చారిత్రికపురుషు కారు. మాక్డఫ్, మాక్డఫ్ ప్రభ్విని గురించి విశ్వసింపతగ్గ విశేషాలు చరిత్రలో ఏమీ కన్పట్టవు. మేక్బెత్ ప్రభ్వి మృత్యువిధానాన్ని గురించి ఏమీ తెలియదు. చరిత్రలో మేక్బెత్ వృద్ధసివద్దు ఎత్తి రావటంవల్ల ఓడిపోవటం లేకపోగా, ఎత్తివచ్చిన నార్తంబ్రియా ఎరలను తరిమివేసి తరువాత బహుకాలం జీవించి రాజ్యపాలన చేసినట్లు కనిపిస్తున్నది. మేక్బెత్ పాలనలో ప్రభుత్వం అతిశక్తిమంతంగా నడిచిందనీ, ప్రజలు సుభిక్షంగా ఉన్న దేశంలో సర్వ సౌఖ్యాలను అనుభవించారన్న విషయాన్ని చరిత్రలన్నీ ఏకకంఠంతో అంగీకరిస్తున్నవి. మేక్బెత్ - ఆంగ్లనాటక సాహిత్యంలో దానిస్థానం 'మేక్బెత్' షేక్స్పియర్ రచనకాలంలోని తృతీయావస్థలో (1601-1608) జన్మించిన ఒక విషాదాంతరూపకం. ఈ దశలో ఆ మహాకవి మేక్బెత్, హామ్లెట్, లియర్ రాజు, ఒథెల్లో, రోమక నాటకాలైన ఆంటోనీ - క్లియోపాత్రా, కొరియ లానస్లను రచించినాడు. లోకంలోని నిరంకుశత్వం అసత్యప్రియత్వం, విశ్వాసఘాతుకత్వం, కృతఘ్నత ఈ కాలంలో షేక్స్పియర్ మహాకవి మనస్సును ఆవరించి, విషాదభావశబలితం చేశాయి. అందువల్ల ఆయన మానవహృదయనైచ్యతలోని లోతులను ఈ దశలోని తన రూపకాలలో త్రవ్విపోసినాడు. విమర్శకులు 'మేక్బెత్'ను ఆంగ్లనాటక సాహిత్యంలో అత్యుత్తమనిధిగా భావిస్తున్నారు. ఈ రూపకంలో కన్పించే విషాదమహత్వాన్ని తిరిగి చూడాలంటే, ఈ స్కైలస్ కవితను ఆశ్రయించవలసిందేనని వారి అభిప్రాయం. ఇందలి దృశ్యసౌభాగ్యం, కవితావైశిష్ట్యం మనోహరాలు, ఈ రూపకంలో రచయిత పాఠకులను ఒక అతీతప్రపంచంలోకి నడిపించుకోపోయి, తన కావ్యభాషాశిల్పవిశేషాల సహాయంతో సృష్టించిన సర్వం చైతన్యోపేతమైన సత్యజగత్తన్నట్లుగా నిరూపిస్తాడు. ఉద్రేకోత్సాహాలతో, అంధవిశ్వాసాలతో, దృఢప్రత్యయాలతో ఇందలి పాత్రలు పఠితల వెన్నాడగల పరమశిల్పమూర్తులు. మేక్బెత్ దుర్గంలోనికి డంకన్ స్వయంగా ప్రవేశించటం, మేకెత్ ప్రభ్వి 'నిద్రా - గమనం', డంకన్ హత్య, మేక్బెత్ దంపతుల సమావేశాలు మొదలైనవి ఈ రూపకంలో వ్యక్తిగతంగా వైశిష్ట్యాన్ని పొందిన దృశ్యాలు. హత్యానిర్వహణ, నిర్వహణానంతరవేళల్లో మేక్బెత్ మనోవైక్లబ్య ప్రదర్శనం, హృదయవిదారకమైన అపురూపచిత్రాలు. 329