మేకెత్ సేనానిమీద అంతర్బహిశ్శత్రువులను సాధించే విషయంలో ఆధారపడటం, మేక్బెత్ రాజౌతాడనీ, బాంకో సంతానంవల్ల రాజపరంపర ఏర్పడుతుందని మువ్వురు మంత్రగత్తెలు జోస్యం చెప్పటం, మేక్బెత్ ప్రభ్వి దురాశవల్ల భర్తను హత్యకు పురికొల్పటం, డంకన్ పుత్రులమీద అనుమానపడటం, హత్యాసమయంలో ప్రకృతివిరుద్ధమైన తుఫాను మొదలైన అరిష్టసూచనలు కనిపించటం, ప్రథమహత్య జరిపిన తరువాత మేక్బెత్ శీలం పతనంకావటం ప్రారంభించటంతో, అతడు ప్రతివారినీ అనుమానించటం ఆరంభించి, సమస్త నీతినియమాలను విసర్జించటం, భయంవల్ల బాంకోను అనుమానించటం వల్లను, అతని సంతానంవల్ల రాజపరంపర ఏర్పడుతుందన్న మంత్రగత్తెల జోస్యప్రభావంవల్లను బాంకోను, అతని కుమారుడు ఫ్లియాన్సును హత్య చేయించటానికి మేక్బెత్ పూనుకుంటే బాంకో హత్యకు గురై ఫ్లియాన్సు తప్పించుకొని పారిపోవటం, స్కాట్లండునుండి పారిపోవటం, మాక్డఫ్ను అనుమానించి అతడు చిక్కకపోవటం చేత అతని కుటుంబాన్నంతటినీ నాశనం చెయ్యటం, మంత్రగత్తెలిచ్చిన ధైర్యంవల్ల మేక్బెత్ ప్రమాదస్థితి త్రోసుకొనివస్తున్నా ఎట్టి భయంలేదని గాఢంగా విశ్వసించటం, మాక్డఫ్-మాల్కొంల మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా గ్రహించి నడిపించటం, ఆంగ్లేయుల సహాయంతో మాల్కొం స్కాట్లండును క్రూరనిరంకుశుడైన మేక్బెత్ పాలనలోనుంచి ఉద్దరించటం మొదలైన అంశాలు షేక్స్పియర్ నాటకంలోను, హాలిన్ షెడ్ రచనలోను నమూనాలై కన్పిస్తున్నవి. మాక్డొనాల్డు విప్లవం, స్వెనోదండయాత్ర, కాన్యూట్ సైన్యం స్కాట్లండుపై ఎత్తిరావటం అన్న మూడు అంశాలు హాలిన్ షెడ్ రచనలో ప్రత్యేకంగా మూడు సమయాల్లో జరిగినట్లుంది. సైనికుడుగా మేక్బెత్ ఎంతటి అధికుడో నిరూపించటం కోసం, షేక్స్పియర్ ఈ ఉదంతాలు మూడూ ఏకకాలంలో జరిగినట్లు మార్పు చేశాడు. హాలిన్ షెడ్ రచనలో మాక్డోనాల్డు ఆత్మహత్య చేసికొన్నట్లున్నది. మన కథానాయకుడైన మేక్బెత్కు వీరగుణాన్ని కల్పించటంకోసం షేక్స్పియర్ అతణ్ణి మేక్బెత్ రణరంగంలో హతమార్చినట్లు మార్చాడు. హలిన్ షెడ్ రచనలో డర్రాజును దుర్గాధిపతియైన డోనాల్డు నియమించిన నలుగురు హంతకులు హత్యచేసినట్లుంది. షేక్స్పియర్ హత్యలోని భయానకత్వాన్ని నిరూపించటం కోసమూ, మేక్బెత్ నైతికపతనాన్ని చిత్రించటంకోసమూ, ఆ హత్యను మేక్బెత్ స్వహస్తాలతో జరిగించినట్లు పరివర్తన చేశాడు. మేక్బెత్ చేసిన విందునుంచి తిరిగి వస్తుండగా బాంకోను హత్యచేసినట్లు హాలిన్ షెడ్ లో ఉంది. షేక్స్పియర్ మేక్బెత్ను, అతని పత్ని మేక్బెత్ ప్రభ్విని ఒక 326 వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/326
స్వరూపం