Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బహు భర్తృత్వం - బహు భార్యాత్వం భూమిక మేక్బెత్ - ఆధారాలు మేక్బెత్ నాటకరచనకు మూలమైన కథనిచ్చి తోడ్పడిన రచన 1577లో పుట్టిన హాలిన్ షెడ్ మహాశయుని స్కాట్లండు రాజవంశావళి. మేక్సెల్లో కొన్ని ప్రకృతివిరుద్ధమైన విశేషాలు మంత్రగత్తెలు, వారి చేష్టలు, విశ్వాసాలు మొదలైనవి కనిపిస్తున్నవి. వీటిని సంగ్రహించటం విషయంలో షేక్స్పియర్ మహాకవికి, అతని కాలంలోని నమ్మకాలతోపాటుగా 1584లో పుట్టిన రెజనాల్గు స్కాట్ 'డిస్కవరీ ఆఫ్ విచ్ క్రాఫ్ట్' అన్న గ్రంథం కూడా తోడ్పడివుంటుంది. షేక్స్పియర్ మహాకవి నాటకనిర్మాణ విషయంలో హాలిన్ షెడ్ క్రానికిల్లోని రెండు ప్రత్యేక భాగాలను ఉపయోగించాడు. అందులోని "హిస్టరీ ఆఫ్ మేక్బెత్" అన్న భాగాన్ని ప్రధానకథకు, ఫోర్రెస్ దుర్గాధిపతి డోన్వాల్డు డఫ్ రాజును చేసిన హత్యాచరిత్రను డంకన్ రాజు హత్యను నిరూపించే సందర్భానికి ఉపయోగించుకొన్నాడు. నాటకీయ శక్తినిపాతమే ప్రధానాశయంగా గల షేక్స్పియర్ మహాకవి, ఆధార గ్రంథాల్లోని అంశాలను స్థలం, కాలం, వ్యక్తుల విషయంలో అనేకరీతులుగా మార్చాడు. అందుచేత మేక్బెత్ 'కేవల చరిత్రాత్మక నాటకమని అంటానికి వీలు లేదు. కథాకల్పనం, పాత్రపోషణ, రసనిరూపణాది కళాకౌశలమంతా షేక్స్పియర్ మహాకవిదే. ఆ మహనీయశిల్పి హస్తాన మేక్బెత్ హృదయస్పంది అయిన ఒక విషాదాంతనాటకంగా పరిణమించింది. మేక్బెత్ - హాలినైడ్ రచన విషాదాంత నాటకతత్త్వం గల మేక్బెత్ కథావస్తువు షేక్స్పియర్ మహాకవికి హాలిన్ షెడ్ రచనలో లభ్యమైంది. అనేక ప్రధానాంశాల విషయంలో ఆయన ఆ రచనను అనుసరించాడు. శక్తిహీనుడైన డంకన్ మహారాజు బలవంతుడు, జయశీలి అయిన 325