Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

114. 115. 116. 117. 118. 119. 120. 121. దేశీయులు నిర్ణయించారు. నిరాశాపూరితుడైన ఎజాక్స్ టెలమస్ ఉన్మత్తుడై, ఎజాకాలు తనకు లభ్యం కాలేదని తన్ను తానే పొడిచి చంపుకొన్నాడు. థెస్సలీ వరాహమైనా : కాలిడన్ రాజైన ఓనియస్ తనయెడ చేసిన అపరాధానికి ప్రతిచర్యగా డయానా ఒక వరాహాన్ని పంపించింది. అదే థెస్సలీ వరాహం. అనేకులైన సాహసికులు దాన్ని వేటాడటానికి బయలుదేరారు. తుదకు దాన్ని ఓనియస్ కుమారుడు మెలియేజర్ చంపాడు. డిడోకు : ఆమె ప్రియుడైన ఏమ్నియాస్కు ట్రాయ్ మహానగరం పడిపోయిన తరువాత ఏయే నియస్ కార్తేజికి వస్తే, కార్తేజి రాజ్ఞి డిడో అతణ్ణి గాఢంగా ప్రేమించింది. అతడు ఆమెను విడిచివెళ్ళిపోయినప్పుడు డిడో ఆత్మహత్య చేసుకొన్నది. - నెప్టూన్రీతార్ణవం - జలదేవత నెప్ట్యూన్ యొక్క పచ్చని సముద్రం. పరమశత్రువులైన పార్థియన్లే : ఇతరశత్రువులకంటే పార్థియన్లు ఆంటోనీకి ఎక్కువ శ్రమ కల్గించారు. క్లియోపాత్రా దారుణప్రభావం వల్లనే ఆంటోనీ తలపెట్టిన పార్థియన్ దండయాత్ర విచ్ఛిన్నమైంది. జూనో నీవు తిరుగుతున్న ఆ మండలాన్ని దగ్ధం చెయ్ : ప్రాచీన టోలమీ సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు ఒక గ్రహం. ఇది ఒక వర్తులాకృతి గల గోళంలో నిబద్ధఅయి ఉంటుందనీ, భూమిచుట్టూ తిరుగుతుందని భావింపబడేది. మెర్క్యురీ : జ్యూపిటర్కు ఇతడు రెక్కల దూత. పంచమాంకం ఇది : డెర్సిటాస్ పట్టుకోవచ్చిన ఖడ్గం. కొలాసస్లోగా : ర్హోడ్స్ అనే ప్రదేశంలో, సముద్రతీరాలు రెంటిమీదా రెండు కాళ్ళను నిల్పిఉన్న మినర్వా విగ్రహంవలె, ఈ విగ్రహం క్రిందుగా యుద్ధనౌకలతో ప్రయాణం చెయ్యవచ్చు. ఈ కొలాసస్ లాగానే ఆంటోనీ మహోన్నత వ్యక్తిత్వం గలవాడనీ, అతనిముందు సామాన్యులు నిలువలేరనీ క్లియోపాత్రా అభిప్రాయం. ఆంటోని - క్లియోపాత్రా 321