106. 107. 108. 109. 110. 111. ఫొయిబస్ రథంలా : పొయిబస్ సూర్యదేవత. ఇతని రథచక్రాలు సూర్యకాంత మణులతో పొదగబడి మనోజ్ఞలై ఉన్నట్లు ఓవిడ్ తన 'మెట మార్పొసిస్' లో వర్ణించాడు. ఉన్మాదాది వ్యసనాలకు : ఉన్మాదం చంద్రదైవతం వల్ల కలుగుతుందని. టిట్టిభాలు (స్వాలోలు) : ఆక్టియం యుద్ధానికి పూర్వం అపశకునాలు ఎన్నో కన్పించినట్లు ఫ్లూటార్క్, క్లియోపాత్రా నౌకాపదనంమీద స్వాలోలు చేరాయి. ముందు వచ్చినవాటిని తరువాత వచ్చి చేరినవి తరిమివేశాయి. ఇదొక మువ్వురిని మార్చిన బంధకీ - క్లియోపాత్రాకు తొలుతటి స్వామి జూలియస్ సీజర్. రెండవవాడు క్నెయస్ పాంపే తరువాతివాడు ఆంటోనీ. ఆంటోనీ ఇప్పుడు ఆమె తన్నుగూడా విడిచి ఆక్టేవియస్ సీజర్ను చేరుతున్నదని అనుమానిస్తున్నాడు. ప్లీబన్లు : రోమను సామాన్యప్రజలు. నెస్సస్ : ఒక విషబాణాన్ని ప్రయోగించి తన్ను బాగా గాయపెట్టిన హెర్క్యూల్స్ మీద ప్రతీకారాన్ని చేసిన 'నరాశ్వం' నెస్సన్. ఇతనికి కల్గిన ప్రతీకారభావోద్వేగం తన్నావహిస్తున్నదని అంటోనీ అభిప్రాయం. హెర్క్యూల్స్ ప్రయోగించిన విషబాణంవల్ల తన శరీరంనుంచి స్రవించే రక్తాన్ని కొంత ప్రేమచిహ్నంగా దాచుకోవలసిందని నెస్సస్ తన భార్య డెజనిరాతో చెప్పి మరణించాడు. తరువాత ఆమె హెర్యూల్సు వస్త్రకంబళాన్ని నెస్సస్ రక్తంలో ముంచి, లిఛాస్ అనే వాడిచేత అతడికి పంపించింది. దాన్ని ధరించటంవల్ల విషం హెర్క్యూల్స్ను ఎంతో బాధపెట్టింది. కోపం వచ్చి హెర్మ్యూల్స్ ఒకమారు లిఛాసన్ను పట్టుకొని సముద్రంలోకి విసిరిపారేశాడు. 112. అల్సీడిస్: అంటే హెర్క్యూల్స్. అల్యూయస్ కుమారుడు. 113. 320 టెలమస్ ఎజాక్సుఖేటం కోసం : ట్రోజన్ వీరుడైన ఎక్కిలిస్ డాలును అతనితల్లి థెటిస్ గ్రీకుల్లో అతిసాహసి ఐన వాడికిస్తానని ప్రకటించింది. యుద్ధంలో మిగిలినవారందరిలో యులిసిస్ వీరుడు. కాబట్టి అతడి కివ్వమని అతని వావిలాల సోమయాజులు సాహిత్యం-3
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/320
స్వరూపం