Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99. 100. 101. 102. 103. రంకెలు వేసేటట్టి అవకాశం తనకు క్లియోపాత్రా నైచ్యాన్ని ప్రకటించేందుకు లభిస్తే బాగుండునని అతడు భావిస్తున్నాడు. చతుర్థాంకం రక్తస్నాన మాడించి : కుష్ఠు మొదలైన వ్యాధులు కొన్ని రక్తస్నానాలవల్ల నయమౌతాయట! పతిని పత్ని మరణపర్యంతం విడిచి చరించినట్లు : “నిన్ను విడిచి నేను చరించను” అన్న వైవాహికశపథాన్ని ఇది స్మృతికి తెస్తున్నది. హ!, హ! హ! : ఆంటోనీ తన దయనీయమైన స్థితిని తానే పరిహసించు కొంటున్నాడు. ఇవి క్లియోపాత్రా అంకం v దృశ్యం V లో మాండ్రగోరారసాన్ని ఇవ్వమన్నప్పుడు, తన్ను గురించి తానే ఉన్మత్తాపహాస్యం చేసుకొన్నట్లు ఆంటోనీ తన్ను గురించి తానే అట్టహాసం చేస్తూ పలికిన పదాలని బాస్వెల్ అభిప్రాయం. ప్రేమించే దైవతము హెర్క్యూల్స్ అంటోనీని పరిత్యజించిన దైవతం బాకస్ అని ప్లూటార్క్. అతడికి దూరదృష్టి, నిర్ణయశక్తి రెండూ లోపించినవని చూపించటంకోసం షేక్స్పియర్ హెర్క్యూల్స్ అతణ్ణి ముందే వదలిపెట్టినట్లుగా వర్ణించాడు. మీ మీద విప్లవం చేసి వెళ్ళిన రాజులు : ఎమిన్హాస్, డైయొటారస్ మొదలైన రాజులు కొందరు ఆక్టియమ్ యుద్ధానికి పూర్వమే ఆంటోనీని విడిచిపెట్టి సీజర్ను చేరుకొన్నారు. 103A. విశ్వశాంతికి కాలమాసన్నమైంది : ఆక్టేవియస్ సీజర్ ఈజిప్టుమీద విజయం చేకొన్నది క్రీ.పూ. 29లో. ఈ వాక్యాన్ని పలికేటప్పుడు షేక్స్పియర్ మనస్సులో జీసస్ జన్మ జ్ఞప్తికి ఉండి ఉండవచ్చునని కొందరి ఊహ. 108B. వారిమీదనే వ్యయిస్తాడు - సీజర్ దారుణయుద్ధనీతికి ఇది చక్కని నిదర్శనం. 104. హెక్టర్ : ఒక ట్రోజన్ వీరుడు. 105. నైటింగేల్ - కమ్మగా పాడే ఒక పక్షి. ఆంటోని - క్లియోపాత్రా 319