7. 8. 9. 10. 11. 10. 13. 14. తండ్రులెవరో తెలియక - అధర్మసంతానం కావటం వల్ల. - నిండి ప్రవహించే నైల్ దరులు నిండి ప్రవహించే నైలు ఒండుమట్టి పెట్టటంవల్ల సస్యానికి లోపం ఉండదు. అంటే విరాన్ పవిత్రగా ఉండజాలదని. తడిచేయి : ఐరాస్ చేయి తడిదనీ, ఫలవంతమైనదనీ ఛార్మియన్ చెప్పటంలో, 'ఆమె కామచపల' అన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నది. ఇసిస్ : ఈజిప్టియనుల దేవతాగణంలో ఒక ముఖ్యురాలు. చంద్రదైవతం. తొలుత ఈమె వారి భూ సస్య సంతానాధి దైవతం. తమ భార్య ఫుల్వియా : ఆంటోనీ క్రీ.పూ. 48-46 మధ్య కాలంలో ప్రఖ్యాతుడైన క్లోడియస్ విధవ అయిన ఫుల్వియాను వివాహమాడాడు. ఈమె రాజకీయ వ్యవహారాలలో పాల్గొనటం ప్రారంభించిన ప్రథమ రోమకవనిత. భర్త ప్రాచ్యదేశాలలో ఉన్నప్పుడు అతని హక్కులను అన్నింటినీ రోములో ఉండి అతిశ్రద్ధతోనూ, సాహసంతోనూ కాపాడింది. క్రీ.పూ. 42, 41లలో ఆంటోనీ సోదరుడైన లూషియన్తో తో కదనభూమిలో నిల్చి పోరాడింది. తరువాత లూషియస్, ఫుల్వియా ఇరువురూ ఆక్టేవియస్ సీజర్ మీద తిరుగుబాటు చేసి రోమును వశపరచుకొన్నారు. కాని క్రీ.పూ. 40లో ఆక్టేవియన్కు సేనావతి అయిన అగ్రిప్పాకు ఓడి, ముల్వియా బ్రండీషియంద్వారా బిడ్డలతో తూర్పునకు పారిపోవలసి వచ్చింది. లూషియస్ లొంగిపోయాడు. భర్తృతృణీకారభావం వల్లా, రాజకీయాలలో ఆమె పాల్గొనటాన్ని అతడు నిందించటంవల్లా జబ్బుపడి సిక్సన్లో ఫుల్వియా మరణించింది. షేక్స్పియర్ మహాకవినాటకం క్రీ.పూ. 40 మధ్యకాలంలో ఆరంభమౌతున్నది. యూఫ్రెటీస్ - ఆసియాలో ఒక నది. స్టెక్సస్ పాంపే : క్రీ.పూ. 106 - 48లలో సుప్రసిద్ధ రోమకసేనానాయకుడై అనేక మహావిజయాలను చేకొన్న పాంపేఘనుడనే మహావీరుని కుమారుడు. అశ్వజాతి కేశాలలాగా - పూర్వం కంబర్ లాండ్ మొదలైన ప్రాంతాలలో అశ్వక్టేశాన్ని నీళ్ళల్లో పడవేస్తే, అది సర్పంగా మారిపోతుందని ఒక నమ్మకం ఉండేది. ఆంటోని - క్లియోపాత్రా 307
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/307
స్వరూపం