Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పొందిన సమాధి ఏదీ ఇలమీద ఉండబోదు. ఇటువంటి బలవత్కృత్యాలు, వాటికి కారకులైన వారికి వ్యతను కలిగింపకపోవు. ఇట్టి బాధాకథను కల్పించటం కారకులకు గౌరవాన్ని కలిగించటంకంటే అధికంగా ఇతరులను దుఃఖితులను చేసి, బాధితులయెడ బహుళతరమైన కరుణను కట్టబెడుతుంది. వీరి అంత్యక్రియల్లో మన సైన్యం శాంతప్రదర్శనలను జరుపుతూ పాల్గొంటుంది. తరువాత రోముకు మనం పయనిస్తాం. రా! డోలబెల్లా! ఈ అంత్యక్రియలు అత్యుత్తమ శోభావిభవపరంపరలతో సాగిపొయ్యేటట్లు చూడు.

(నిష్క్రమిస్తాడు)


ఆంటోని - క్లియోపాత్రా

305