Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్లియోపాత్రా : శుభమగుగాక! వెళ్లు!

గ్రామీణుడు : చూడండి. ఈ పురుగు తన స్వభావానికి అనుగుణంగానే వర్తిస్తుంది.

క్లియోపాత్రా : నిజం. నీకు శుభం!

గ్రామీణుడు : చూడండి. చాలా ప్రాజ్ఞులైనవారి పాలనలో ఉంటే తప్ప ఈ పురుగును నమ్మటానికి వీల్లేదు. ఎందువల్లనంటారా, దీనిలో సహజమైన మంచితనం లేదు.

క్లియోపాత్రా : నీవేమి ఆదుర్దాపడకు. అగత్యం లేదు. కడు శ్రద్ధ వహిస్తాను.

గ్రామీణుడు : మంచిది. దయుంచి దానికేమీ పెట్టవద్దు. అది అలా తిండి పెట్టదగ్గది కాదు.

క్లియోపాత్రా : అయితే అది మరి నన్ను తింటుందా?

గ్రామీణుడు : నన్నొక వెర్రివాడినని అనుకోకండి. స్త్రీని భూతమే తిననప్పుడు, పురుగెందుకు తింటుంది? భూతం ఆమెను అలంకరించకపోతే స్త్రీ దేవతలకు భోగ్యం కాదగ్గది. కానీ ఈ భూతాలు దేవతలకు స్త్రీలను కల్పించటంలో వారికెంతో కీడు కల్గిస్తున్నారు. వారు సృజించే ప్రతి పదిమందిలోనూ అయిదుగురిని చెడకొడుతారు.

క్లియోపాత్రా : మంచిది. వెళ్ళిపో. నీకు శుభమగుగాక!

గ్రామీణుడు : మీరు కోరుకున్న పురుగు చిక్కిందనుకొంటాను. దీనివల్ల మీకు ఆనందం కలుగుగాక!

(నిష్క్రమిస్తాడు)

దుస్తులు, కిరీటం తీసుకుని ఐరాస్ ప్రవేశిస్తుంది.

క్లియోపాత్రా : నా దుస్తులతో నన్ను అలంకరించు. కిరీటాన్ని అమర్చు. దివ్యత్వాకాంక్షలు నాలో విజృంభిస్తున్నాయి. ఇక క్షణకాలమైనా ఈజిప్టు ద్రాక్షాసావంతో నా మోవిని శీతలం చెయ్యను. ఉదాత్త! ఐరాస్!! త్వరపడు. సిద్ధపడు. ఆంటోనీ నన్ను పిలుస్తున్నట్లు తోస్తున్నది. ఈ నా ఉదాత్తకృత్యాన్ని స్తుతించటం కోసం ఆయన తిరిగి లేచి వస్తున్నట్లు కన్పిస్తున్నాడు. దేవతలు తరువాత తాము ప్రకటించే క్రోధాన్ని కప్పిపుచ్చుకొనేటందుకు ప్రసాదించిన సీజర్ మహైశ్వర్యాన్ని, ఆయన పరిహసిస్తున్నట్లు నాకు విన్పిస్తున్నది. ప్రణయవతీ! నేను వస్తున్నాను. నీ పత్నినని పిలవబడటానికి తగ్గ యోగ్యత నాకున్నదని నా ధైర్యం నిరూపించుగాక! నాలోని ఇతరభూతాలను నేను అల్పప్రాణులకు ఇచ్చివేశాను.


ఆంటోని - క్లియోపాత్రా

301