దోలబెల్లా : ప్రొక్యూలియస్! నీవు నిర్వర్తించిన స్వరం నీ యజమానికి చేరింది. ఆ నీ కోసం వార్త పంపించాడు. ఇక ఈ రాజ్ఞి రక్షణభారాన్ని నేను వహిస్తాను.
ప్రొక్యూలియస్ : దోలబెల్లా! నాకు చాలా తృప్తిగా ఉంది. అమెయెడ ఎంతో ఉదాత్తంగా వర్తించు. (క్లియోపాత్రాతో) ఏమన్నా చెప్పవలసింది అని మీరు నన్ను నియోగిస్తే నేను దాన్ని సీజర్ మహాశయునికి తెలియజేస్తాను.
క్లియోపాత్రా : అయితే నేను మరణిస్తానని చెప్పు.
(ప్రొక్యూలియస్, సైనికులు నిష్క్రమిస్తారు)
దోలబెల్లా : అత్యుదాత్త సామ్రాజ్ఞి! నన్ను గురించి మీరు విన్నారా?
క్లియోపాత్రా : నేను చెప్పలేను.
దోలబెల్లా : నిశ్చయంగా మీరు నన్నెరుగుదురు.
క్లియోపాత్రా : నేను ఏమి విన్నా లేదా తెలుసుకున్నా పరవాలేదు. పసిపాపలు గాని, పడతులు గాని తమ కలలను గురించి చెపితే నీవు నవ్వుతావు కదూ?
దోలబెల్లా : మీరనేది నాకేమీ అర్థం కావటం లేదు.
క్లియోపాత్రా : ఆంటోనీ అనే ఒక సమ్రాట్టు ఉన్నట్లు నేను కలగన్నాను. ఓహో! అతడు పోయిన నిద్రవంటి నిద్రను అనుభవిస్తున్న అటువంటి మరోవ్యక్తిని నేను చూడగలిగితే?
దోలబెల్లా : అభిలషిస్తే అటువంటి ఇంకో వ్యక్తిని మీరు చూడవచ్చు.
క్లియోపాత్రా : అతని ముఖం ఆకాశాన్ని పోలి ఉంటుంది. అందులో సూర్యచంద్రు లిరువురూ సంచారం చేస్తూ క్షుద్రమండలమైన భూమిని భాసింపజేస్తుంటారు.
దోలబెల్లా : ఆంటోనీ రాచరికం మూర్తీభవించిన వ్యక్తి.
క్లియోపాత్రా : మహాసముద్రపుటొడ్లమీద రెండు పాదాలను నిలిపి అతడు కోలాసస్ 12 గా నిలిచాడు. ఆయన ఉద్యద్భాహువులు ప్రపంచ గోళాకారాన్ని వహిస్తున్నవి. ఆయన కంఠం గోళాల సంగీతం 122 వంటి సంగీతంతో సుసజ్జితమైంది. ఆయన తన కంఠమాధుర్యాన్ని మిత్రులయెడనే ప్రయోగించేవాడు. ప్రపంచాన్ని భయంతో కంపింపజేయ దలచుకొన్నప్పుడు మేఘగంభీరంగా గర్జించేవాడు. ఆయన కరుణాగుణానికి శీతకాలమంటూ లేదు. అందులో చల్లదనంగాని, గడ్డకట్టటంగాని
ఆంటోని - క్లియోపాత్రా
293