రాజ్యాన్ని ఆయన నా కుమారుడికి ఇవ్వదలచుకొంటే నాకు యాజమాన్యం ఉన్న దాన్ని నాకివ్వటమే ఔతుంది. మోకాళ్లపై నిల్చి నమ్రనై ఆయనకు నమస్కరిస్తాను.
ప్రొక్యూలియస్ : ఉత్సాహాన్ని చిక్కపట్టుకోండి. ఒక మహాసమ్రాట్టు మీకు రక్షకులైనారు. ఇక మీరు ఎందుకు జంకవలసిని అగత్యం లేదు. అవసరాలు గలవారెందరున్నా అనుగ్రహించటానికి అనవరతకరుణాన్వితుడైన మా ప్రభువుకు స్వేచ్ఛగా మీ విజ్ఞాపనాన్ని తెలియజేయండి. మనఃపూర్వకంగానూ, పరిపూర్ణంగానూ మీరు వారిమీద ఆధారపడుతున్నానని వారికి నివేదించుకోటానికి అంగీకరించండి. ఇలా జరిగిస్తే, వారి దయాగుణాన్ని అభిలషించి వినమ్రులైతే, అందుకు సహాయాన్ని తానే అర్థించే ఒక విజేతను ఆయనలో మీరు దర్శింపగలుగుతారు.
క్లియోపాత్రా : ఐశ్వర్యవంతుడైన ఆయనకు నేను సామంతను కావటాని కిష్టపడతాననీ, అలా చేయటం వల్ల ఆయన ఆర్జించుకొన్న ఘనతను అంగీకరించటమే ఔతున్నదని తలపోస్తున్నాననీ, ఆయనకు తెలియజేయవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను. సమయం నా వల్ల అభిలషించే వినమ్రతను గూర్చిన పాఠాన్ని నేర్చుకొంటాను. ఆయనను ముఖాముఖిగా అమితానందంతో దర్శింపగలుగుతాను.
ప్రొక్యులియస్ : ప్రియ ప్రభ్వీ! ఇదంతా ఆయనకు నివేదిస్తాను. మీకీ దైన్యస్థితిని కల్పించిన ఆయనే మీ దుఃస్థితిని గుర్తించి కరుణ వహిస్తున్నాడు. కనుక ఉల్లాసాన్ని వహించండి.
గాల్లస్ : ఆమెను ఎంత త్వరగా బందీని చేయటానికి వీలుంటుందో గమనించండి. ఒక వాతాయనంమీద వాల్చిన నిశ్రేణిక మీదుగా ప్రొక్యూలియస్, ఇరువురు రక్షకభటులు సమాధినిర్మాణాన్ని ఆరోహించి లోపలికి దిగి క్లియోపాత్రా వెనుకకు వస్తారు. కొందరు రక్షకభటులు కవాటాలను వివృతం చేస్తారు.
ప్రొక్యూలియస్ : (రక్షకభటులతో) సీజర్ మహాశయుడు విచ్చేసేదాకా ఆమెను భద్రంగా కాపాడండి!
ఇరోస్ : మహారాజ్జీ!
ఛార్మియన్ : క్లియోపాత్రా! రాజీ! నిన్ను వారు బందీని చేశారు.
క్లియోపాత్రా : (ఛురికను దూస్తూ) ఓ నా హస్తాల్లారా! త్వరపడండి. త్వరపడండి!
ఆంటోని - క్లియోపాత్రా
291