Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పంచమాంకం

ఒకటో దృశ్యం

అలెగ్జాండ్రియాలో సీజర్ శిబిరం, సీజర్, అగ్రిప్పా, దోలబెల్లా, గాల్లస్, ప్రొక్యూలియస్, తదితరులూ, సీజర్ యుద్ధసమయమంత్రివర్గం ప్రవేశిస్తారు.

సీజర్ : దోలబెల్లా! అతని దగ్గరికి వెళ్లు. లొంగిపొమ్మని ఆజ్ఞాపించు. అలా ఓడిపోయినవాడు ఇంకా ఆలస్యాలను కల్పించటం హాస్యాస్పదంగా ఉందను.

దోలబెల్లా : సీజర్ మహాశయా! అలాగే నిర్వర్తిస్తాను.

డెర్సిటాస్ ఆంటోనీ ఖడ్గంతో ప్రవేశిస్తాడు.

సీజర్ : ఇది 12° ఎక్కడినుంచి రక్తపంకిలమైన ఖడ్గంతో మా ముందు కన్పించటానికి సాహసించావు. నీవెవరు?

డెర్సీటాస్ : నా పేరు డెర్సిటాస్! నేను మార్క్ ఆంటోనీ సేవకుణ్ణి. పరుల సేవలను అందుకోటానికి ఆయన పరమయోగ్యత కలవాడు. సజీవుడుగా ఉన్నప్పుడు ఆయన నా యజమాని. అప్పుడు ఆయన్ను నిందించినవారిని అంతమొందించటానికి నా జీవితాన్ని అంకితం జేశాను. ఆయనయెడ నేను ఎలా వర్తించానో అలాగే మీరు నన్ను పరిగ్రహింపదలిస్తే, సీజర్, మిమ్మల్ని గూడా అలాగే కొలుస్తాను. ఇందుకు మీరు అంగీకరించకపోతే మీ సమక్షంలోనే జీవితాన్ని చాలిస్తాను..

సీజర్ : నీవనేది ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు.

డెర్సిటాస్ : ఇట్టి దారుణవార్త వచ్చినపుడు ఘనగర్జనలు వినిపించి ఉండవలసింది. జగత్తు సింహసంహతులను విశృంఖలంగా రాజమార్గాలలో విహరించటానికని విసిరివేసి, అవి పరిత్యజించిన గుహల్లోకి నాగరకులను తరిమి పంపించి ఉండవలసింది. మార్క్ ఆంటోనీ మరణమంటే అది ఒక వ్యక్తికి కలిగే ఉపప్లవం కాదు. అతని నామంలో ప్రపంచార్ధభాగం ఇమిడి ఉంది.

సీజర్ మహాశయా! ఆయన మరణించాడు. ఒక ప్రజాన్యాయ నిర్వాహకుడివల్ల కాదు అద్దెకు వచ్చిన హంతకుడి ఖడ్గధారవల్ల అంతకంటే కాదు. ఆయన నిర్వహించిన


ఆంటోని - క్లియోపాత్రా

287