Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఛార్మియన్ : అయ్యో! ఉద్రిక్తవు కాకమ్మా!

ఐరాస్ : మన సామ్రాజ్ఞి మరణించింది కూడాను!

ఛార్మియన్ : రాజ్జీ! రాఖీ!!

ఇరోస్ : ప్రభ్వీ! ప్రభ్వీ!!

ఛార్మియన్ : రాష్ట్రీ! మహారాజ్జీ!!

ఇరోస్ : ఈజిప్టురాజ్జీ! సామ్రాజ్జీ!!

ఛార్మియన్ : నిశ్శబ్దం! నిశ్శబ్దం!! ఐరాస్!

క్లియోపాత్రా : 'రమణీ' అన్న మాటలతో తప్ప 'రాజీ సామ్రాజ్జీ' అన్న పదాలతో ఇక పని లేదు. పాలు పితుకుతూ, పనిపాటలతో బ్రతికే నా స్త్రీ జాతిలోని క్షుద్రవనితలతో నేను తుల్యత వహిస్తున్నాను. అనర్హరత్నమైన నా ఆంటోనీని కాజేసేటంతవరకూ తమ రాజ్యంతో సర్వవిధాలా సామ్యం వహించిన ప్రపంచం మీద మీరు స్పర్ధ వహించారని ఆ దుష్టదేవతలతో చెప్పి నా రాజదండాన్ని విసిరిపారేయటం నాకు యుక్తమైన పని. మానవజన్మల్లో మహితమైనదంటూ కన్పించదు. మందబుద్ధులకు అనుద్వేగం అభిమానగుణం. ఉద్వేగం, ఉన్మత్త కుర్కురికి గుణం. అయితే అది మనదగ్గరికి చేరటానికైనా సాహసించేముందే మృత్యురహస్యనికేతన ప్రవేశం కోసం పరువెత్తటం పాపకృత్యమా?

ఓ నా నారీగణమా! మీ బాధేమిటి? నిరాశపడకండి! ఉల్లాసాన్ని కల్పించుకోండి. ఛార్మియన్! అదేమిటి? అలా విషణ్ణచిత్తవై కనిపిస్తున్నావేమిటి ఓ నా ఉదాత్తకన్యకలారా! అయ్యో! వనితాగణమా! గమనించండి. నా జీవితజ్యోతి చల్లారబోతున్నది చల్లారనే చల్లారింది. ఉత్తమ వనితలారా! సుస్థిరలు కండి. మనము ఆయనకు ఖననకర్మ చేయిద్దాం. తరువాత ఉత్తమ రోమకాచారాన్ని అనుసరించి ఏది సాహసకార్యమో, ఏది ఉత్తమకృత్యమో దాన్ని నిర్వర్తిద్దాము. మృత్యువుకు మనసు పొందగలిగిన గర్వాన్ని కల్పిద్దాం. రండి! అనుసరించండి!! ఆ మహాత్ముని శరీరం ఇప్పుడు అతిశీతలమై పోయింది. అయ్యో వనితాగణమా! రండి! మనకు నిర్ణయం తప్ప మిత్రుడంటూ లేడు. అతివేగంగా మరణించటం తప్ప మనం ఆచరింపదగ్గ కార్యమూ లేదు.

(ఆంటోనీ శరీరాన్ని మోసుకొంటూ పైవారందరూ నిష్క్రమిస్తారు)


{{Rh|286||}వావిలాల సోమయాజులు సాహిత్యం-3}