ఆంటోనీ : నేను మరణిస్తున్నాను. ఈజిప్టురాజ్జీ! నేను మరణిస్తున్నాను. కొంత ద్రాక్షాసవాన్నివ్వు మరికొంతసేపు మాటాడగలుగుతాను.
క్లియోపాత్రా : కాదు ప్రభూ! నన్ను మాటాడనివ్వు. ఆమె మీద విసరబోతున్న నిందకు కోపం తెచ్చుకొని, తనచక్రాన్ని బ్రద్దలుకొట్టే రీతిలో అనతికాలంలో నన్ను వీడబోతున్న ద్రోహచిత్త ఆ అదృష్టదైవతాన్ని విరుచుకోపడి తిట్టనీ!
ఆంటోనీ : మధురప్రియా! ఒక్కమాట. సీజర్ వల్ల నీ గౌరవభద్రతలకు రెంటికీ ఎట్టి అపాయం కలగదు. సంధి చేసుకో. ఓ రాజీ! నా కోరికను చెల్లించు.
క్లియోపాత్రా: నా గౌరవభద్రతలు రెండూ కలసి మెలగలేనివి.
ఆంటోనీ : సాధుశీలా! నా మాట విను. సీజర్కు సంబంధించిన విషయాల్లో ప్రొక్యులైయన్ను తప్ప అన్యులను ఎవరినీ నమ్మకు.
క్లియోపాత్రా : నా నిర్ణయాన్నీ, నా హస్తాలనూ మాత్రమే నమ్ముతాను. సీజర్ను గురించిన విషయాల్లో ఇతరులను ఎవరినీ నమ్మను!
ఆంటోనీ : నాకు అంత్యకాలం సన్నిహితమైంది. కనుక నా అదృష్ట విషయంలో ఏర్పడ్డ విషమపరిణామానికి నీవు దుఃఖించకు. సమస్తప్రపంచానికీ రాజాధిరాజునై మహోదాత్తుణ్ణిగా మెలిగిన పూర్వవైభవస్మృతులను జ్ఞప్తికి తెచ్చుకొని, నీ ఊహలకు తృప్తిని కలిగించు. నేను నీచమరణాన్ని పొందు తున్నానని తలపోయకు. పిరికిపందనై నా దేశీయుడికొకడికి శిరస్త్రాణాన్ని అర్పించానని అనుకోకు. నేను ఒక రోమను దేశీయుడివల్ల పరాక్రమోపేతంగా జితుడనైన రోమను దేశీయుడను. నా ఆత్మ ఇక నన్ను వీడిపోతున్నది. నా శక్తి తుదముట్టింది.
క్లియోపాత్రా : మానవజాతిలోకెల్ల మహోదాత్తుడా! నీవు మరణిస్తున్నావా? నా సంరక్షణతో నీకు పని లేదా? నీవు లేనిది కేవలం వరాహాలకు వాసయోగ్యమైన ఈ స్తబ్ధప్రపంచంలో నన్నుండిపొమ్మంటున్నావా? అయ్యో! చూడండి. ఓ నా నారీగణమా! రత్నగర్భకిరీటం కరిగిపోయింది. ఓ ప్రభూ! అయ్యో!! కదనకుసుమదామం బాలురు, వాడిపోయింది. ఓ సైనికధ్వజం చెదిరిపోయింది. సర్వమానవులూ బాలికలు, అందరూ ఇప్పుడు ఒకే వర్గానికి చెందినవారైనారు. కీర్త్యాదార్యాల కీళ్లు సడలిపోయాయి. నిత్యయాత్రకు విచ్చేసే చంద్రదైవతానికి ఇక అవనీతలం మీద చూడనర్హమైన వస్తువంటూ ఏమీ మిగలలేదు!
(మూర్ఛపోతుంది)
ఆంటోని - క్లియోపాత్రా
285