Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్కారస్ : మొదట నా గాయం 'టి' అనే అక్షరం కారణంగా ఉండి ఇప్పుడు 'హెచ్' ఐంది.

ఆంటోనీ : వారు వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నారు.

ఇరోస్ ప్రవేశిస్తాడు

ఇరోస్ : ప్రభూ! వారిని విజితులను చేశాం. మనకు ఘనవిజయాన్ని కూర్చటానికి ఈ అవకాశం ఎంతో అధికంగా ఉపకరిస్తుంది.

స్కారస్ : వారిని వెన్నాడుదాం. జాగిలాలు కుందేళ్ల వెంటబడి తరిమి పట్టుకొన్నట్లుగా వారిని పట్టుకొందాం. పారిపొయ్యేవారిని వెన్నంటి పట్టుకోటం ఎంతో విచిత్రమైన క్రీడ.

ఆంటోనీ : నీవు నాకిస్తున్న వీరోచిత ప్రోత్సాహానికి ఒక రెట్టుగానూ, నీ సాహసానికి పదిరెట్లుగానూ నిన్ను బహూకరిస్తాను. పద.

స్కారస్ : నేను మీ వెంట కుంటుతూ వస్తాను.

(నిష్క్రమిస్తారు)

ఎనిమిదో దృశ్యం

అలెగ్జాండ్రియా కుడ్యాల ముందు. హెచ్చరిక. ఆంటోనీ సైనికవిన్యాసంతో ప్రవేశిస్తాడు. స్కారస్ ఇతరులతో ప్రవేశిస్తాడు.

ఆంటోనీ : అతణ్ణి శిబిరం వరకూ తరిమి కొట్టాము. మీలో ఒకరు ముందుగా రాజ్ఞి దగ్గరికి పరుగెత్తుకోవెళ్ళి, ఆమెకు మనం సాధించిన ఘనకార్యాలను తెలియజేయండి. సూర్యుడు ఉదయించి తిరిగి మనను చూచేలోగా ఈ నాడు తప్పించుకోపోయినవారి నెత్తుటేళ్లను ప్రవహింపజేద్దాం. మీ కివే నా కృతజ్ఞతాపూర్వకమైన అభినందనలు. మీరందరూ మహాబలశాలురైన వీరపుంగవుల్లా ప్రవర్తించారు. భృతికోసం పోరు సల్పినవారిలా కాకుండా కదన కారణం నాదే కాక మీలో ప్రతి ఒక్కరిదీ అయినట్లు పోరాడారు. హెక్టర్ వంటి మహావీరులమని మీరందరూ ప్రదర్శించుకొన్నారు. నగరంలో ప్రవేశించండి! మీ మీ పత్నులనూ, మిత్రులనూ గాఢాశ్లేషసౌఖ్యంలో ముంచెత్తండి!! బవరంలో తగిలిన పవిత్రమైన మీ గాయాలమీద ఆనందబాష్పాల


270

వావిలాల సోమయాజులు సాహిత్యం-3