క్లియోపాత్రా : మరికొంతసేపు నిద్రించండి.
ఆంటోనీ : ఓసి పెట్టా! వీలు లేదు. ఇరోస్ రా, నా కవచాన్ని తీసుకో రా. ఇరోస్!
కవచంతో ఇరోస్ ప్రవేశం
రా! మంచి సేవకుడవోయ్! ఈ లోహకవచాన్ని నా శరీరానికి అమర్చు. అదృష్టం ఇవాళ మనకు అనుకూలించకపోతే అది క్లియోపాత్రాను తిరస్కరించి పోతున్నందువల్ల కలిగిందనుకోవలసి ఉంటుంది. నా వెంట రా!
క్లియోపాత్రా : అలా అనకండి. నేను కూడా మీకు తోడ్పాటు నిస్తాను. ఇది ఎందుకు?
ఆంటోనీ : దాని ప్రమేయం నీకెందుకు? నీవు తొడగవలసింది ధైర్యకవచాన్ని. తప్పు, తప్పు అంతా తప్పు.
క్లియోపాత్రా : నేను మీకు కవచధారణలో సాయపడి తీరవలసిందే. ఇలా ఉండాలి ఇప్పుడు తెలిసింది.
ఆంటోనీ : మంచిది. ఇప్పుడు విజయం మనదే. చూచావుటోయ్, ఎలా కవచంతో శరీర రక్షణ చేసుకొన్నానో! ఇక వెళ్ళు. నీ రక్షకదళాలను తమ తమ స్థానాలలో నిలుపు.
ఇరోస్ : తమ ఆజ్ఞను తక్షణమే నిర్వహిస్తాను.
క్లియోపాత్రా : కవచాన్ని సక్రమంగా అమర్చాను కదూ!
ఆంటోనీ : దానికి అమరిక ఇంత బాగా ఎన్నడో గాని కుదరలేదు. విశ్రాంతికి అవసరమని నేను కోరినప్పుడు తప్ప, ఎవరు దీన్ని విప్పుతారో వారికి ప్రళయం తప్పదు. ఇరోస్! నీవు దాన్ని పట్టుకోటానికి ఇలా తికమక పడిపోతున్నావేమిటి? నీ కంటే ఇందులో నా రాజే ప్రవీణగా గోచరిస్తున్నది. త్వరపడండి. ఈ నాటి నా రణకర్మకౌశలాన్ని దర్శించి క్షాత్రవృత్తి అంటే ఏమిటో తెలుసుకోగలవు. ఈ నాటి నా యుద్ధక్రియలో ఒక కళాప్రవీణుడెలా కదనరంగంలో విశృంఖల వీరవిహారం చేస్తాడో నీకు గోచరిస్తుంది.
కవచధారియైన ఒక సేవకుడు ప్రవేశిస్తాడు
సుప్రభాతం! ఇదే నా స్వాగతం! పరుల పైబడటంలో నీవు ప్రవీణుడివిలా కన్పిస్తున్నావు. అతిప్రియమైన కృత్యాన్ని నిర్వహించటానికి మనం సకాలంలో మేల్కొన్నాము. అందుకోసం మహానందంతో మనమందరం బయలుదేరుదాం.
ఆంటోని - క్లియోపాత్రా
265