పాదదేశాన నా కిరీటాన్ని నిల్పి నతులర్పించటానికి సంసిద్ధురాలనని విన్నవించు. సర్వజన పాలితమైన ఆయన కంఠనిశ్వాసం ఈజిప్టును గురించి ఏమని శాసిస్తే అందుకు లోబడి నడుచుకోటానికి సర్వసంసిద్ధురాలనని విన్నవించు.
థైరియస్ : ప్రస్తుతస్థితిలో ఇదే మీకు పరమోదాత్తమైన మార్గం. వివేకం, అవకాశం రెండూ పరస్పరవ్యతిరేకాలై కలహిస్తున్నప్పుడు, వివేకం తన సర్వశక్తినీ వినియోగించి ధైర్యోపేతంగా నిలువగలిగితే, అవకాశం దాన్ని అణుమాత్రమైనా కదలించలేదు. తమ హస్తంమీద నా సమ్మాన చిహ్నమైన చుంబనముద్రను నిలపటానికి అనుగ్రహించండి.
క్లియోపాత్రా : నూతన రాజ్య సంపాదనబుద్ధితో విచ్చేసి మీ సీజర్ తండ్రి అయోగ్యమైన యీ హస్తప్రదేశాన తన రదనచ్ఛదాలతో చుంబనవృష్టి కురిపించాడు.
ఆంటోనీ, ఎనోబార్బస్ తిరిగి ప్రవేశిస్తారు.
ఆంటోనీ : పర్జన్యాధిపుడైన జౌసాక్షిగా వాణ్ణి అనుగ్రహిస్తున్నదే - ఎవరోయ్ నీవు?
థైరియస్ : సర్వసంపత్పరిపూర్ణుడూ, నిఖిలజనపాలిత నిజశాసనుడూ అయిన మహావ్యక్తి ఆజ్ఞలను నిర్వర్తించే ఒక అల్పుణ్ణి.
ఎనోబార్బస్ : (స్వగతం) ఓరీ! నీ కిందుకు కశాఘాతలు తప్పవు.
ఆంటోనీ : మీరందరూ అక్కడికి చేరండి. ఓహో! ఓసి గ్రద్దా!! దేవతలారా!! భూతరాశు లారా!! అధికారం నా హస్తాలలోనుంచీ కరిగిపోతున్నది. నిన్న మొన్నటివరకూ నేను కేకపెడితే చిరుపండ్లకోసం చరచరప్రాకుతూ వచ్చే పసిపిల్లల్లా ఎందరెందరో రాజులు 'ఏమాజ్ఞ?' అని అడుగుతూ వచ్చారు. మీకేం చెవులు లేవా? వినిపించటంలేదా? ఇంకా నేను ఆంటోనీనే!
సేవకులు ప్రవేశిస్తారు.
ఈ తిమ్మణ్ణి ఇక్కడినుంచి తీసుకుపోయి కొరడా దెబ్బలు కొట్టండి.
ఎనోబార్బస్ : (స్వగతం) మరణాసన్నమైన వృద్ధసింహంతో ఆడటం కంటే సింహకిశోరంతో క్రీడించటం ఉత్తమం.
ఆంటోనీ : చంద్రదైవతమా! నక్షత్రరాశీ!! ఈ గాడిదను కట్టికొట్టండి. సీజర్ సర్వాధికారాన్ని అంగీకరించే మహాసామంతులు ఇరవైమంది ఇక్కడికి వచ్చినా, అంతటి తులువతనంతో ఆమె హస్తాన్ని ముద్దిడుకోటాన్ని చూచి నేను సహించను. ఆమె
ఆంటోని - క్లియోపాత్రా
255