ఆంటోనీ : అతని సమాధానం అదేనా?
యూఫ్రోనియస్ : అవును ప్రభూ!
ఆంటోనీ : ఆమె నన్ను మోసగిస్తేనే అతనివల్ల క్రమమైన మర్యాదను పొందుతుందన్నమాట!
యూఫ్రోనియస్ : అని వారంటున్నారు.
ఆంటోనీ : అయితే ఈ విషయాన్ని రాజ్ఞికి తెలియజెయ్! రాజ్యాలయెడా, రాష్ట్రాలయెడా ఉన్న పరిపూర్ణాభిలాష తీరాలంటే బాలుడైన 7 ఆ సీజర్ దగ్గిరికి నా ఈ నెరిసిన తలను పంపించాలని తెలియజెయ్ !!
క్లియోపాత్రా : ఆ తలనా, ప్రభూ?
ఆంటోనీ : మళ్లీ సీజర్ దగ్గరికి వెళ్ళి చెప్పు! పరికీర్తిత యౌవనాలంకారశోభితుడవు. నీవేదైనా విశిష్టకార్యదూర్వహుడవై నిర్వర్తించి చూపాలె నని లోకం కోరుతున్నది. నీ సంపత్తి, సైనికబలాలు, నౌకాదళాలు ఏ పిరికిపందకైనా ఉండవచ్చు. సీజర్కు ఉండాలా? ఒక పసిబిడ్డ కున్నా అవి విజయాన్ని సాధించటం తథ్యం. అందువల్ల అతడికి సహజంగా లభ్యమైన సంపదను దూరంగా ఉంచి అస్తమించిన అధికారయౌవనాలుగల నన్ను ఒంటిగా ఎదుర్కోవలసిందని ఆహ్వానిస్తున్నానని చెప్పు. నేనీ వీరాలాపాన్ని లిఖితపూర్వకంగా పంపుతాను. నా వెంట రా!
(ఆంటోనీ, యూఫ్రోనియస్ నిష్క్రమిస్తారు)
ఎనోబార్బస్ : (స్వగతం) అవును. మహాసైన్యసంపత్తికి అగ్రేసరుడైన సీజర్ ఈ ద్వంద్వయుద్ధాహ్వానాన్ని అంగీకరించటం సంభవమేనా? ఉపలభ్యమానాలై ఉన్న సహజావకాశాల నన్నింటినీ అవతలపెట్టి, ఆ సీజర్ ప్రజలు దర్శించటం కోసం ఒక సామాన్యఖడ్గ విన్యాసప్రదర్శకుడితో తా జగడమాడటంకోసం రంగస్థలంమీద నిలుస్తాడా? అసంభవం! ఇది ఎంత విచిత్రమైన ఊహ? మానవుల నిర్ణయాలు కూడా వారి అదృష్టాన్నే అనుసరిస్తుంటాయి. రెండూ తుల్యంగా వినాశనాన్ని పొందాలి గనుక మానసికగుణవిశేషాలను కూడా అదృష్టం తన వెంట నడిపిస్తుంటుంది. వివిధవ్యక్తులు శక్తిసామర్థ్యాలను పరిగణించటంలో ప్రముఖవిజ్ఞాని అయిన తాను, సర్వైశ్వర్య పరిపూర్ణుడైన సీజర్, అధఃపతితుడైన తనతో సమఫాయాలో సమరరంగాన సమాధానం
252
వావిలాల సోమయాజులు సాహిత్యం-3