సీజర్ : ఇలా దగ్గరకు రావయ్యా! మాటాడు.
యూఫ్రోనియస్ : మహార్ణవంతో పోలిస్తే గొంజిఆకుమీద మంచుబొట్టు ఎంతో ఉపాధ్యాయుడనైన నేను అంతగా కొలది కాలంనుంచీ ఆయన ప్రయోజనాలకు తోడ్పడుతున్నాను.
సీజర్ : కావచ్చు, నీవు వచ్చిన ప్రయోజనమేమిటో వెల్లడించు.
యూఫ్రోనియస్ : తన అదృష్టానికి అధిపతులైన మీకు నమస్కరించి, అతడు ఈజిప్టులో నివసించటానికి అనుమతించవలసిందని అర్దిస్తున్నాడు. ఇందుకు మీరు అంగీకరించని పక్షంలో తన కోర్కెను తగ్గించుకొని ఏథెన్సులో ఒక ప్రత్యేకవ్యక్తిగా భూమ్యాకాశాల మధ్య జీవించటానికి అనుమతించవలసిందని ప్రార్థిస్తున్నాడు. ఆయన్నుగురించి మీకు నివేదించవలసింది ఇంతే. తరువాత క్లియోపాత్రా మీ ఆధిక్యాన్ని అంగీకరించి మీకు లొంగిపోయింది. అపాయస్థితికి పాలైన టోలమీల కిరీటాన్ని తన వారసులకు దక్కించవలసిందని ఆమె మిమ్మల్ని అభ్యర్థిస్తున్నది.
సీజర్ : ఆంటోనీ విషయంలో - అతడి అభ్యర్థనను నేను చెవిని బెట్టను. ఈజిప్టు రాజ్ఞిని గురించి - ఆమెకు సమ్ముఖాన్ని కల్పించటంగాని, ఆమె కోర్కెలు తీర్చటంగాని నేను కాదనను. కానీ, ఇందుకు ఆమె సర్వవిధాలా గౌరవచ్యుతుడైన తన ప్రియుణ్ణి ఈజిప్టు దేశంనుంచి బహిష్కృతుణ్ణి చేయటం గాని, ప్రాణహరణం చేయటంగాని చేయవలసి ఉంటుంది. ఇందులో ఏది జరిగించినా ఆమె ప్రార్థనలను విని అనుకూలంగా వ్యవహరించటం జరుగుతుంది. ఇదే వారిద్దరికీ నా సమాధానం.
యూఫ్రోనియస్ : అదృష్టదేవత మిమ్మదరించుగాక!
సీజర్ : ఇతణ్ణి సైన్యాలగుండా నడిపించుకోపొండి.
(యూఫ్రోనియస్ నిష్క్రమిస్తాడు)
(థైరియస్తో) క్లియోపాత్రా యెడ నీ వకృత్వప్రావీణ్యాన్ని ప్రదర్శించి పరీక్షించుకోవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. వెంటనే బయలుదేరు. క్లియోపాత్రాను ఆంటోనీ నుంచి వేరుచేయటంలో విజయం సాధించు. ఆమె కోరినవెల్లా ఇచ్చేయ్ - నా పేరు చెప్పి వాగ్దానం చెయ్యి. ఆమె కోరుకొన్నవే కాదు, ఇంకా నీ ఊహకు తోచినవాటిని కూడా చేర్చి ఇచ్చేయ్. తమ అదృష్టాలు, పరాకాష్ఠలను అందుకొన్నప్పుడు అబలలెన్నడూ మానసికంగా సబలలై నిలువలేరు. పురుషస్పర్శ అంటే ఏమో ఎరుగని వెష్ఠాదేవి 95
250
వావిలాల సోమయాజులు సాహిత్యం-3