Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంటోనీ : ఈజిప్టురాజ్జీ! నా హృదయం ప్రణయసూత్రాలతో నీవనే చుక్కానికి బంధితమై ఉందనీ, నీవు నన్ను వెంట లాక్కోపోతావనీ, నీకు ఎంతో బాగా తెలుసును. నా అంతరాత్మ మీద నీకెంతటి సర్వాధికారం ఉన్నదీ నీవు ఎంతో బాగా ఎరుగుదువు. దేవతల అనుశాసనాన్నైనా తిరస్కరించి వచ్చేటట్లు నీ అత్యల్పమైన సంజ్ఞ కూడా నన్ను ఆజ్ఞాపించి రప్పిస్తుందని నీకు తెలుసు.

క్లియోపాత్రా : ఓ నా ప్రభూ! నన్ను క్షమించండి!!

ఆంటోనీ : ఒకనాడు నా ఇచ్ఛానుసారంగా ప్రపంచార్ధంలోని ప్రజల అదృష్టాలకు ఉదయాస్తమయాలను కల్పించిన నాకు ఈ నాడతినీచతమాదృష్టుడనై, అణకువతో ఆ యువకుణ్ణి సంధికోసం అభ్యర్థించటానికి ఎంతో తంటాలు పడవలసిన స్థితి పట్టింది. నన్నెంతగా నీవు జయించావో ఎరుగుదువు. ప్రణయంవల్ల నా ఖడ్గం ప్రాభవహీనమై సర్వకాల సర్వావస్థల్లోనూ దాని ఆజ్ఞలను అనుసరిస్తుందని నీవెరుగుదువు.

క్లియోపాత్రా : క్షమించండి! నన్ను క్షమించండి!!

ఆంటోనీ : నీ విషాదాశ్రుబిందువు నొకదానినైనా చిందనీయకు. అది నేను జయించి కోల్పోయిన సర్వంతో సమానమైన మూల్యం కలది. ఏదీ ఒక ముద్దు. ఇదైనా చాలు, నే కోల్పోయిన సర్వాన్నీ తిరిగి చెల్లిస్తుంది. మన ఉపాధ్యాయుణ్ణి పంపించాను. ఆయన తిరిగివచ్చాడా? ప్రియా! దుఃఖం నన్ను పూర్ణంగా ఆవరించింది. కొంత ద్రాక్షాసనాన్నీ, ఉపహారాలను తెచ్చియివ్వండి. గట్టిదెబ్బలు తీస్తున్నప్పుడే మనం దాన్ని గాఢంగా అసహ్యించుకొంటామని అదృష్టానికి తెలుసు.

పన్నెండో దృశ్యం

ఈజిప్టు, సీజర్ శిబిరం, సీజర్ దోలబెల్లా, థైరీయస్ ఇతరులతో ప్రవేశిస్తారు.

సీజర్ : ఆంటోనీ దగ్గరనుంచి వచ్చిన వ్యక్తిని దర్శనం చేసుకోమనండి - నీవు అతణ్ణి ఎరుగుదువా?

దోలబెల్లా : సీజర్ మహాశయా! అతడు నాకు తెలుసును. క్లియోపాత్రావల్ల ఆంటోనీకి కలిగిన బిడ్డలకు అతడు ఉపాధ్యాయుడు . కొలదిమాసాలకు పూర్వం వార్తాహరులనుగా ఎందరెందరో రాజులను ఉద్యోగించగలిగిన ఆంటోనీ, ఇట్టి ప్రయోజనం కోసం ఇతణ్ణి పంపించటమే అతడు సమస్తకీర్తినీ కోల్పోయినాడనటానికి ప్రబల నిదర్శనం.

ఆంటోనీ పంపిన రాయబారి యూఫ్రోనియస్ ప్రవేశిస్తాడు.


ఆంటోని - క్లియోపాత్రా

249