బొబ్బలు పెడుతున్నాడు. పాంపేను హత్యచేసిన లెపిడస్ ఉద్యోగి 44 కుత్తుకను ఉత్తరిస్తానంటూ బెదిరిస్తున్నాడు.
ఎనోబార్బస్ : ఘనమైన మన నౌకాసైన్యం సముద్రం మీదికి వెళ్లటానికి సిద్ధపడ్డది.
ఐరాస్ : మనం సీజర్ కోసం ఇటలీకి వెళ్ళాలి. డొమిటియస్! నేను చెప్పవలసింది ఇంకా ఉంది. ప్రభువు అంటోనీ నిన్ను వెంటనే వచ్చి దర్శనం చేసుకోమన్నాడు. నేను నీకు చెప్పిన వార్తలను అన్నింటికీ తరువాత చెప్పి ఉండవలసింది.
ఎనోబార్బస్ : ఇంకా చెప్పవలసినవి అంత ప్రముఖమైనవి కాదనుకొంటాను. సరే కానీ, నన్ను ఆంటోనీ దగ్గరికి తీసుకోవెళ్లు.
ఐరాస్ : పద.
(నిష్క్రమిస్తారు)
ఆరో దృశ్యం
రోములో సీజరు గృహం, సీజర్, ఎగ్రిప్పా, మెకన్నాస్ ప్రవేశిస్తారు.
సీజర్ : రోమును అలక్ష్యం చేసి అలెగ్జాండ్రియాలో అంటోనీ ఇంతే కాదు, ఇంకా ఎంతో చేశాడు. విపణి ప్రదేశంలో వెండి మలామా చేసిన వేదికమీద ప్రజలందరి ఎదుటా అతడూ క్లియోపాత్రా బంగారపు ఆసందులను అధిష్ఠించారట! వారి పాదదేశాన, వారు నా తండ్రికి కలిగిన " కొమారుడని చెప్పే సీజరియన్, వారి ధర్మేతరసంతానం ఉపవిష్ణులైనారట! అతడు ఆమెకు ఈజిప్టు రాజ్యాన్ని ఇచ్చివేశాడట! దక్షిణసిరియా, సిప్రస్, లిడియాలకు ఆమెను సర్వాధికారిణి అయిన రాజ్ఞినిగా అతడు ప్రకటించాడట! అతడి ప్రవర్తనరీతి అంతా ఈ ధోరణిలోనే ఉంది.
మెకన్నాస్ : అతడు ఇదంతా చేసింది ప్రజల కన్నుల ఎదుటనేనా?
సీజర్ : అవును. వారికి వ్యాయామరంగభూమిగా ఉన్న ప్రజాప్రదేశంలోనే. అక్కడ తన కుమారులను రాజాధిరాజులని ప్రకటించాడు. అలెగ్జాండరుకు బృహన్మీడియా, పార్థియా, ఆర్మీనియాలను ప్రదానం చేశాడు. టోలమీకి సిరియా, సిలీసియా, ఫొనీషియాలను ప్రత్యేకించాడు. చంద్రదైవతమైన ఇసిస్ దుస్తులను ధరించి ఆ నాడామె ప్రజలకు దర్శనమిచ్చింది. ఇలా నూతనచంద్రదేవతలాగా ఆమె ఇంతకు పూర్వమే ఎన్నోమార్లు దర్శనమిచ్చిందట!
ఆంటోని - క్లియోపాత్రా
237