Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూడో దృశ్యం

అలెగ్జాండ్రియాలో క్లియోపాత్రాసౌధం.

క్లియోపాత్రా, ఛార్మియన్, ఐరాస్, ఎలెగ్జాస్ ప్రవేశిస్తారు.

క్లియోపాత్రా : వాడు ఏడీ?

ఎలెగ్జాస్ : రావటానికి సగం భయపడుతున్నాడు.

క్లియోపాత్రా : ఛీ! వాడు భయపడటానికి తగ్గకారణం ఏమీ లేదు.

వార్తాహరి పూర్వంలాగానే ప్రవేశిస్తాడు

ఇక్కడికి రావయ్యా!

ఎలెగ్జాస్: మహారాజ్జీ! ఉల్లాసంగా ఉన్నప్పుడు తప్ప ఆ హీరాడ్ జూరీ కూడా నీ ముఖంవంక తలెత్తి చూడలేడు. హిరాడ్ వంటి చిత్తోల్బణాలు నాకూ ఉండి ఉన్నట్లయితే ఎంతో బాగుండేది. ఆంటోనీ వెళ్లిపోయినతరువాత వాటిని ఎవరి మూలాన చలాయించేది? దగ్గరికి రావయ్యా!

వార్తాహరి : ఘనత వహించిన మహారాజ్జీ!

క్లియోపాత్రా : నీవు ఆక్టేవియాను చూచావా?

వార్తాహరి : అవును మహారాజ్జీ!

క్లియోపాత్రా : నీవు ఆమెను ఎక్కడ చూచావు?

వార్తాహరి : రోములో చూచాను, మహారాజ్ఞి! సీజర్, ఆంటోనీ ఆమెను తమమధ్య నిల్పుకొని నడిపించుకుంటూ పోతుంటే చూచాను. చాలా సన్నిహితంగా ముఖాన్ని పరికించి చూచాను.

క్లియోపాత్రా : ఆమె నా అంత పొడగరేనా?

వార్తాహరి : లేదు మహారాజ్జీ!

క్లియోపాత్రా : ఆమె మాట్లాడుతుండగా విన్నావా? ఆమెది కీచుగొంతా? లేక పలుచని గొంతా?

వార్తాహరి : మహారాజ్జీ! విన్నాను. ఆమె కంఠం సన్ననిది.


232

వావిలాల సోమయాజులు సాహిత్యం-3