లెపిడస్ : టోలమీలు నిర్మించిన పిరమిడ్లు మహాద్భుతమైనవని విన్నాను. వాటి విషయంలో ఏ వంక నుంచీ విభిన్నాభిప్రాయం వినిపించలేదు.
మెనాస్ : (పాంపేతో - అపవారితంగా) పాంపే మహాశయా! ఒకమాట!
పాంపే : (అపవారితంగా - మెనాస్తో) నింపాదిగా చెవిలో చెప్పు. ఏమిటిది?
మెనాస్ : (పాంపేతో - అపవారితంగా) మీ ఆసనాన్ని విడిచి ఒక్కమారు లేచిరండి, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఒక్క మాట విని పొండి.
పాంపే : (అపవారితంగా -మెనాస్తో) వస్తున్నాను. ఒక్క క్షణకాలం క్షమించు. ఈ ద్రాక్షాసవం లెపిడస్ ఆరోగ్యం కోసం!
లెపిడస్ : మీ మొసలి ఎటువంటిది?
ఆంటోనీ : దాని ఆకారం దాని ఆకారంలాగానే ఉంటుంది. అది ఎంత వెడల్పో దాని వెడల్పు అంత. అది ఎంత ఎత్తో దాని ఎత్తు అంత. అది దాని అవయవాలతోనే సంచరిస్తుంది. దానికి ఏది బలవర్ధకమైన ఆహారమో దానిమీదనే అది జీవిస్తుంది. కానీ దాని ప్రధానద్రవ్యాల్లో అణుమాత్రం మార్పు వచ్చినా అది మరోజంతువుగా 67 మారిపోతుంది.
లెపిడస్ : దాని రంగు ఎలా వుంటుంది?
ఆంటోనీ : దాని రంగు లాగానే.
లెపిడస్ : అయితే అది చాలా విచిత్రమైన జంతువు!
ఆంటోనీ : అవును. నీవన్నట్లే. కానీ దాని కన్నీళ్లలో తేమ ఉంది.
సీజర్ : అతడికి నీ ఈ వర్ణనవల్ల ఏమైనా తృప్తి కలిగిందా?
ఆంటోనీ : అది తృప్తిని కలిగించకపోతే అతని ఆరోగ్యం కోసం పాంపే ఇస్తున్న ఈ ఆసవం తృప్తిని కలిగిస్తుంది. లేకపోతే ఇక అతడికి తృప్తిని కల్గించటం అసాధ్యం.
పాంపే : (మెనాస్తో అపవారితంగా) నాశనం కానివ్వు! ఎల్లా పోతే అలా పోనీ! అది నాకెందుకు చెపుతావు? నేను నిన్ను ఆజ్ఞాపించినట్లు చెయ్. లెపిడస్ కోసం నేనాజ్ఞాపించిన చషకమేది?
222
వావిలాల సోమయాజులు సాహిత్యం-3