మెనాస్ : అట్టి స్త్రీ భార్యగా ఉండటాన్ని కోరుకోనివాడంటూ ఎవడైనా ఉంటాడా?
ఎనోబార్బన్ : ఉండకేం? ఆ స్వభావాలు లేనివాడు అట్టి వనితను భార్యగా కోరుకోడు. మార్క్ ఆంటోనీ అటువంటి వ్యక్తి. అతడు తిరిగి తన ఈజిప్టు వంటకం దగ్గరికే చేరుకొని తీరతాడు. అప్పుడు ఆక్టేవియా వేడినిట్టూర్పులు సీజర్ శరీరంలోని రక్తోష్టమను సంధుక్షణం చేస్తాయి. ఇందాక నేనన్నట్లు నేటివారి స్నేహబలమే తరువాత ప్రబలవైరానికి కారణమౌతుంది. ఆంటోనీ తన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే సుఖిస్తాడు. ఒక రాజకీయ కారణంవల్ల ఇక్కడ వివాహమాడాడు. అంతే!
మెనాస్ : అవును. అలాగే జరగవచ్చు. రా. నౌక మీదికి రావా? నీ ఆరోగ్యానికి నేనో పానీయాన్ని నిర్దేశిస్తాను.
ఎనోబార్బస్ : నీవు నిర్దేశించిన పానీయాన్ని నేను తప్పక సేవిస్తాను. ఈజిప్టులోని మధుసేవల్లో మా గొంతుకలకు మహాఘనంగా పని కల్పించాము.
మెనాస్ : రా. వెళ్లుదాము.
(నిష్క్రమిస్తారు)
ఏడో దృశ్యం
సంగీతం వినిపిస్తుంటుంది. ఒక వంటకంతో ఇద్దరో, ముగ్గురో సేవకులు ప్రవేశిస్తారు.
ప్రథమ సేవకుడు : ఒరేయ్, వాళ్లిక్కడే ఉంటారు. వారిలో కొందరి అడుగులు అప్పుడే తడబడుతున్నాయి. చిన్న చిరుగాలి వీస్తే చాలు, చిత్తుగా పడిపోతారు.
ద్వితీయ సైనికుడు : తాను త్రాగిన ద్రాక్షవల్ల లెపిడస్ ఎఱ్ఱనారిపోయినాడు. 64
ప్రథమ సేవకుడు : అసవశేషాన్ని కూడా అతని చేతనే త్రాగించారు.
ద్వితీయ సైనికుడు : విలాసోత్సాహంలో వారు ఒకరిభాగాలను మరొకరికి పోస్తూ నిర్బంధ పెడుతున్నప్పుడు, అతడు 'ఇక చాలు. వద్దు!' అని కేకలు పెట్టాడు. అయితే వారి ప్రార్థనలను ఒకవంక తిరస్కరిస్తున్నా మరోవంక సహవ్రతు లిరువురి మధ్య శాంతిని సంధించటం కోసం అతడు తప్పతాగాడు.
220
8వావిలాల సోమయాజులు సాహిత్యం-3