దొంగలు మిత్రులౌతూ పరస్పరం ముద్దిడుకొనేటప్పుడు వారిని బందీలనుగా ఇప్పుడే పట్టుకోగలవు.
మెనాస్ : చేతులెటువంటివైనా వ్యక్తుల ముఖాలు వారి శీలాన్ని వ్యక్తీకరిస్తుంటాయి.
ఎనోబార్బస్ : మోసగించని ముఖంగల స్త్రీ ఒక్కతైనా ఉండదు.
మెనాస్ : నీవన్నది అభాండం కానే కాదు. అతివలు హృదయాలను అపహరిస్తారు.
ఎనోబార్బస్ : మేము నీతో పోరాడటానికని వచ్చాము.
మెనాస్ : కానీ, నా అభిప్రాయం చెప్పనా, అది తిని త్రాగటం క్రిందికి దిగింది. పాంపే ఈ నాడు తన అదృష్టంతో పరాచకాలాడుతున్నాడు. 162
ఎనోబార్బస్ : అలా చేసి ఉన్నట్లయితే అతడెంతగా విలపించినా, తరువాత తప్పిపోయిన తన అదృష్టాన్ని తిరిగీ పొందలేడు.
మెనాస్ : మీరు సత్యం చెప్పారు. మార్క్ అంటోనీ ఇక్కడికి వస్తాడని మేము ఊహించలేదు. క్షమించండి. ఆయన క్లియోపాత్రాను వివాహమాడాడా?
ఎనోబార్బస్ : ఆయన పెళ్లాడింది క్లియోపాత్రాను కాదు. సీజర్ సోదరిని, ఆక్టేవియాను.
మెనాస్ : అది నిజం. ఆమె కెయస్ మార్సెల్లస్కు వెనుక భార్య కదూ?
ఎనోబార్బస్ : అయితే ఇప్పుడామె మార్కస్ ఆంటోనీయస్కు భార్య అయింది.
మెనాస్ : క్షమించాలి! నీవు చెప్పేది -
ఎనోబార్బస్ : సత్యం!
మెనాస్ : అయితే, ఆంటోనీ, సీజర్ స్థిరానుబంధం ఏర్పరచుకొన్నారన్న మాట!
ఎనోబార్బస్ : ఈ అనుబంధాన్ని గురించి జోస్యం చెప్పమని నన్నడిగితే ఇది స్థిరమైందని నేననను.
మెనాస్ : వివాహితులు అనురాగం కంటే ఈ పరిణయ విషయంలో రాజకీయ కారణాలు విశేషపాత్ర వహించాయని అనుకొంటాను.
ఎనోబార్బస్ : నేనూ అలాగే భావిస్తున్నాను. వారిరువురినీ మిత్రులనుగా కూర్చిన ఈ బంధమే వారి స్నేహానికి ఉరిత్రాడు" కావటం ఆనతికాలంలోనే నీవు చూడగలుగుతావు. ఆక్టేవియా పవిత్రురాలు. అతిశీతలస్వభావ, నిత్యవర్తనలో అతిస్తబ్ధ.
ఆంటోని - క్లియోపాత్రా
219