ఎనోబార్బస్ : ప్రభూ! నేను మిమ్మల్ని పూర్వం ఎన్నడూ ప్రేమించలేదు. కానీ ఎన్నోమారులు ప్రస్తుతించాను. స్తుతించినప్పుడల్లా నాకు మీరు పదింతలుగా ప్రస్తుతికి యోగ్యులని అనిపించారు.
పాంపే: కాపట్యం లేని నీ కమనీయసంభాషణకు నాకు మహానందం కలుగుతున్నది. ఇది నీకు లోపం కాదు. నా నౌక మీదికి విందారగించను రమ్మని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దారి చూపించండి.
సీజర్, ఆంటోనీ, లెపిడస్ : మీరే దారి చూపించండి.
పాంపే : అయితే అనుసరించండి.
(మెనస్, ఎనోబార్బస్ తప్ప అందరూ నిష్క్రమిస్తారు)
మెనాస్ : (అపవారితంగా) మీ జనకులు పాంపే అయితే ఇటువంటి సంధి చేసేవారు కారు - నీవూ, నేనూ పూర్వం కలుసుకొన్నామనుకొంటాను.
ఎనోబార్బస్ : సముద్రంమీద కలుసుకొన్నాం.
మెనాస్ : అవును.
ఎనోబార్బన్ : నీటిమీద నీవు మంచి ప్రావీణ్యాన్ని ప్రదర్శించావు.
మెనాస్ : నీవు నేలమీద మంచి ప్రజ్ఞను ప్రకటించావు.
ఎనోబార్బస్: నేలమీద ప్రదర్శించిన ప్రజ్ఞకు నేను స్తుతియోగ్యుడను కానని తిరస్కరించను గాని, నన్ను స్తుతించి ఏ వ్యక్తినైనా నేను తిరిగి స్తుతించటానికి సంసిద్ధుణ్ణి.
మెనాస్ : సముద్రం మీద ప్రకటించిన ప్రావీణ్యానికి నేనూ స్తుతియోగ్యుడను కాదని అనను.
ఎనోబార్బస్ : భద్రతకోసం ఏదో ఒకటి ఒదులుకోవాలి కనుక - నీవు సముద్రాలమీద గొప్ప బందిపోటువు.
మెనాస్ : నీవు నేలమీద గొప్పదొంగవు.
ఎనోబార్బస్ : ఈ విషయంలో నాకు నేలమీద ప్రావీణ్యం ఉందని నేను అంగీకరించను. కానీ, మెనాస్, నీ హస్తమేదీ? మన కన్నులే పాలనాధికారం గలవైతే, ఇరువురు
218
వావిలాల సోమయాజులు సాహిత్యం-3