పాంపే : మీ కుదువజనం నా దగ్గిరా నా కుదువజనం మీ దగ్గిరా ఉన్నారు. యుద్ధానికి దిగబొయ్యేముందు మనం కొంత సంభాషించుకోవలసి ఉంది.
సీజర్ : తొలుతగా మనం ఇలా సంభాషణకు పూనుకోటం సముచితంగా ఉంది. అందుకోసమే వ్రాతమూలకంగా మా నిబంధనలను మా రాకకు ముందుగానే నీకు చేర్చాము. వాటిని పూర్వమే మీరు పరిశీలించి ఉంటారనుకొంటాము. మరి నీవు విప్లవఖడ్గానికి ఒరచూపించి వెంట తెచ్చిన బలశాలురైన వీరయువకులనందరినీ సిసిలీకి తిరిగి తీసుకోపోతావో, లేకపోతే ఇక్కడ బలి ఇస్తావో తెలియజేస్తావా? 55
పాంపే : ఈ రోమకసామ్రాజ్యానికి ఏకైకపాలకులు, సర్వదేవతా ప్రతినిధులూ అయిన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఫిలిప్పీ యుద్ధరంగంలో ఉదాత్తు డైన బ్రూటస్ నన్ను జూలియస్ సీజర్ భూతమై వెన్నాడినప్పుడు మీరు ఆయనకోసం ప్రతీకారాన్ని పొందారు. కుమారుణ్ణి, మిత్రులను కలిగిఉన్న నా జనకుడు " అట్టి ప్రతీకారాన్నే ఎందుకు పొందకూడదు? వివర్ణవీక్షలు గల కాషియస్ సీజర్మీద ద్రోహాన్ని ఎందుకు తలపెట్టవలసివచ్చింది? సర్వజన ప్రీతిపాత్రుడు, సత్యసంధుడు అయిన బ్రూటస్ శస్త్రధారియై స్వేచ్ఛాపిపాసువులు సహాయంతో సభాభవనాన్ని రక్తపంకిలం చేయటానికి పురికొల్పిందేది? అదే ఈ నాడు దాని భారంవల్ల సముద్రాన్ని క్రోధంతో నురగలు కక్కేటట్లు చేసే నౌకాదళాన్ని నిర్మించటానికి ప్రోత్సహించింది. ఈ నౌకాదళంతో, ఉదాత్తుడైన నా తండ్రి యెడ నిర్లక్ష్యం చేసి ప్రకటించిన కృతఘ్నతకు తగ్గ ప్రతీకారాన్ని నేను చేయదలిచాను.
సీజర్ : పాంపే! నీవు స్వేచ్ఛగా సంభాషించవచ్చు. 56
ఆంటోనీ : నీ నౌకాదళాన్ని చూపెట్టి, పాంపే, నీవు మమ్మల్ని భయపెట్టలేవు. ఇక నేలమీద నీ కంటే మేమెంత అధికులమో అది నీకు తెలియంది కాదు. 57
పాంపే : నిజం ఆంటోనీ! మా జనకుల సౌధాన్ని సంగ్రహించావు. కనుక నేలమీద మీరు నా కంటే అధికులే. నీ వలెనే నిజంగా కోకిల తనకోసమని ఒక గూడు కట్టుకోదు. మరో శకుంతసదనాన్ని ఆక్రమిస్తుంది. అందులో స్థిరనివాసం చేయటానికి ఇక చేతనైతే యత్నించు.
లెపిడస్ : ఈ ప్రసంగానికి వర్తమానంతో ఎట్టి ప్రసక్తి లేదు. మేము పంపించిన కాన్కలను నీవు ఎలా స్వీకరించావో తెలియజేస్తావా?
సీజర్: అవును. వ్యవహారాన్ని ఇక మనం సాగనివ్వాలి.
ఆంటోని - క్లియోపాత్రా
215