Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రార్థిస్తున్నాను. మంచిచెడ్డలు కలగలుపుతో, మిత్రుడా! నీవు తెచ్చిన వార్తలన్నిటితో, ఒకేమారు నా చెవులను నింపేయి! ఆయన సీజర్తో మిత్రుడుగా ఉన్నాడన్నావు, ఆరోగ్యవంతుడుగా ఉన్నాడన్నావు, స్వతంత్రుడుగా ఉన్నాడన్నావు కదూ?

వార్తాహరి : స్వతంత్రుడని నేనన్నానా? లేదు రాజీ! ఆయన ఆక్టేవియాతో అనుబంధితుడైనాడు.

క్లియోపాత్రా : ఛార్మియన్! ఈ వార్తతో నేనెంతగా పాలిపోయానో గమనించావా?

వార్తాహరి : రాజీ! ఆయన ఆక్టేవియాను పరిణయమాడాడు.

క్లియోపాత్రా : అంటువ్యాధులన్నింటిలోనూ అమితశక్తి గలది నిన్ను ఆవరించుగాక!

వార్తాహరి : రాజ్జీ! శాంతి వహించండి.

క్లియోపాత్రా : ఏమంటున్నావు? ఇక్కడినుంచి వెళ్ళిపో! (తిరిగి కొడుతుంది) ఓరి మహాద్రోహీ! వెళ్ళిపో! లేకపోతే నీ కనుగ్రుడ్లను కాలిముందున్న బంతుల్లా తన్నేస్తాను. తలమీది వెంట్రుకలన్నిటినీ ఊడబెరికిస్తాను. (కురులు పట్టుకొని క్రిందికి పైకీ లేవనెత్తి కూలబడుస్తుంది) తీగతో నిన్ను కొట్టించి, ఉప్పునీటిలో పడేయించి తన్నుకొనేటట్లు చేయిస్తాను.

వార్తాహరి : ఔదార్యగుణోపేతా! రాజీ!! నేను కేవలం వార్తను తెచ్చినవాణ్ణిగాని, ఆ పెళ్ళి చేయించినవాణ్ణి గాను.

క్లియోపాత్రా : అలా కాదు. ఆ వివాహం జరగలేదని చెప్పు నీకో రాజ్యమిస్తాను. ఘనమైన సంపదలిస్తాను. నీవు నాకు కోపం తెప్పించటమనే దోషాన్ని చేశావు. అందుకు నా వల్ల తిన్న దెబ్బలనే శిక్ష సరిపోతుంది. దీనికి తోడుగా ఇంకా నీవు ఏమి కోరుకొంటే అదల్లా ఇస్తాను. ఆ పరిణయం జరగలేదని చెప్పు!

వార్తాహరి : రాజ్జీ! ఆయన వివాహమాడాడు.

క్లియోపాత్రా : ఓరి ద్రోహీ! నీవు ఇప్పటికే బహుకాలం బ్రతికావు! (కత్తి దూస్తుంది)

వార్తాహరి : అయితే నేను పారిపోతాను. నేనే తప్పిదమూ చెయ్యలేదు.

ఛార్మియన్: రాజీ! నీ మేర మీరవద్దు. అతడు నిర్దోషి.


212

వావిలాల సోమయాజులు సాహిత్యం-3