Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మెకెయ్నిస్ : అందినవార్తలు నిజమైతే ఆమె అసాధారణమైన వైభవం ఉన్న అతివట!

ఎనోబార్బస్ : తొలుతగా ఆమె ఆంటోనీని సిడ్నసినది " మీద కలుసుకొన్నప్పుడు అతని హృదయాన్ని దోచి దాచేసింది.

అగ్రిప్పా : అక్కడే ఆమె మహావైభవాన్ని ప్రదర్శించిందని విన్నాను. ఇది అసత్యమైతే నా వార్తాహరి కల్పనాప్రావీణ్యంలో ఘనుడన్నమాట! 41

ఎనోబార్బస్ : ఆ విశేషాలన్నీ మీకు నివేదిస్తాను. ఆమె అధివసించిన ఆసనం ఆ నదీజలాలల్లో బంగారుమలామా చేసిన మహాసనంలా మెరిసింది. దాని పశ్చార్ధనావం విశాలస్వర్ణ పత్రసంశోభితం. నౌకాపటాలు నీలవర్ణ నిలయాలు. పవనాలకు వాటిమీద ప్రణయం జనించిందా అన్నట్లు అవి పరిమళాలను వెదజల్లాయి. ఆ యానపాత్ర క్షేపణాలు అతిస్నిగ్ధరౌప్య వినిర్మితాలు. అవి సుషిరస్వనాలతో లయకల్పి తాము తట్టే నీరానికి శృంగారభావాన్ని కల్పించి చలింపజేశాయా అనిపించాయి. ఇక ఆమెరూపం వర్ణనాతీతం. తపనీయతంతువులతో అల్లిన అమూల్యమంటపంలో, ప్రకృతిని అధఃకరించే భావనాబలంతో స్థపతి శిల్పించి నిల్పిన వీనస్ విగ్రహాన్ని ఎన్నో రెట్లుగా మించి ఆమె శయనమూర్తి భాసించింది. ఆమె కిరుపార్శ్వాలా అందమైన గండకూపకాలతో ఇరువురు బాలకులు చిరునవ్వులు చిలుకరిస్తూ మన్మథమూర్తుల్లా నిలిచి, శబలవర్ణ ప్రకీర్ణకాలతో చల్లబడజేసే కోమలకపోలసీమలను కాంతిమంతం.చేస్తున్నారు. ఇలా వారు ఉక్కను పోగొట్టుకోటానికి పూనుకొని ఉష్టిమను కల్పించారు.

అగ్రిప్పా : ఆహా! ఆంటోనీ అక్షిద్వయానికి ఎంత అపూర్వమైన దృశ్యం. ఇక ఆమెస్త్రైణం సాగరకన్యలైన నైరైడ్స్"లా సర్వావయవాలంకరణశోభితలు. ఎల్లవేళలా ఆమె కనులమీదనే దృష్టి నిలుపుతూ, ఆమె మనోభావాలకు అనుగుణంగా అవయవచాలనం చేస్తూ, వారు ఆమెను కొలుస్తున్నారు. మెర్మైడ్గా కనిపిస్తూ ఒక నారీమణి చుక్కానిపట్టి నౌకను నడిపింది. సుమకోమలి అయిన ఆమె హస్తస్పర్శవల్ల కలిగిన గర్వంతో ఉప్పొంగి, ఆ మెత్తని ఉపకరణం అతిలాఘవంతో తన కర్తవ్యాన్ని పాలించింది. ఆ విహారనౌకనుంచి విచిత్రమూ, అదృశ్యమూ అయిన వాసనాద్రవ్యం తీరుభూములను తన సుగంధంతో ముంచెత్తింది. తనదర్శనం చేసుకొనేటందుకని ఆమె ఆ మహానగరంలోని సర్వప్రజనూ అక్కడికి నడిపించింది. గాలిలో ఈలలు వేసుకొంటూ ఆంటోనీమాత్రం విపణిప్రదేశంలో ఏకాంతంగా తన ఆసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. శూన్యం అయిపోతుందని అనుకోకపోతే 42


ఆంటోని - క్లియోపాత్రా

205